Mahesh Babu about Love Story Movie: చైతూపై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్!
- September 27, 2021 / 06:16 AM ISTByFilmy Focus
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. కలెక్షన్లపరంగా దూసుకెళుతున్న లవ్ స్టోరీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన పెద్ద సినిమా కావడం, ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పెద్ద హీరోలు తమ సినిమాలను ధైర్యంగా రిలీజ్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా లవ్ స్టోరీ సినిమాను చూసి ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు.
మహేష్ బాబు తన ట్వీట్ లో నటుడిగా నాగచైతన్య ఎదిగాడని పేర్కొన్నారు. లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య పర్ఫామెన్స్ బాగుందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మూవీని చాలా బాగా తెరకెక్కించారని మహేష్ అన్నారు. లవ్ స్టోరీ సినిమాతో సాయిపల్లవి గతంలోలా మరోసారి సెన్సేషన్ ను క్రియేట్ చేసిందని మహేష్ బాబు కామెంట్లు చేశారు. స్క్రీన్ పై సాయిపల్లవిలా డ్యాన్స్ చేయడం తాను ఎప్పుడూ చూడలేదని మహేష్ బాబు అన్నారు.

అసలు సాయిపల్లవికి ఎముకలు ఉన్నాయా? అంటూ సాయిపల్లవి డ్యాన్స్ గురించి మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. మహేష్ చేసిన కామెంట్లు సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లవ్ స్టోరీ మూవీకి పవన్ ఇచ్చిన మ్యూజిక్ సంచలనమే అని మహేష్ అన్నారు. పవన్ సీహెచ్ రెహమాన్ శిష్యుడని తెలిసిందని ఈ సినిమాతో రెహమాన్ కూడా గర్వపడే సమయం ఆసన్నమైందని మహేష్ చెప్పుకొచ్చారు. లవ్ స్టోరీ ఈ ఏడాది రిలీజైన సినిమాలలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందేమో చూడాలి.
#LoveStory @sekharkammula pulls all the right strings… delivers a knockout film!! @chay_akkineni comes of age as an actor, a game-changer for him… What a performance!! 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2021
లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!











