Mahesh Babu: సర్కారు వారి పాటలో మహేష్ రోల్ అలా ఉంటుందా?

స్టార్ హీరో మహేష్ బాబు సినీ కెరీర్ లో పోకిరి సినిమా ప్రత్యేకమనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు నటుడిగా మహేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేట్ అయిన రికార్డులను బ్రేక్ చేసి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం 12 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన పోకిరి ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

Click Here To Watch

పండుగాడు పాత్రలో మహేష్ అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఆ సినిమాలో మహేష్ కేర్ లెస్ గా కనిపిస్తారు. సర్కారు వారి పాట సినిమాలో కూడా మహేష్ బాబు పాత్ర కేర్ లెస్ గా సమాజంపై బాధ్యత లేని విధంగా ఉంటుందని సమాచారం. సినిమాలో అమ్మాయిలకు మహేష్ బాబు దూరంగా ఉంటాడని అయితే కళావతి పాత్రలో ఉన్న కీర్తి సురేష్ ను చూసిన తర్వాత మహేష్ అభిప్రాయాలన్నీ మారిపోతాయని సమాచారం.

బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్ హీరోకు హగ్ ఇచ్చిన సమయంలో కళావతి సాంగ్ ఉంటుందని బోగట్టా. యూట్యూబ్ లో ఈ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. మహేష్ కెరీర్ లోని బెస్ట్ సాంగ్స్ లో ఈ సాంగ్ కూడా ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అక్కినేని స్టూడియోస్ లో ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

మేకర్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా మే 12వ తేదీన సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. గీతా గోవిందం సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న పరశురామ్ సర్కారు వారి పాట సినిమాతో సక్సెస్ సాధిస్తే స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే ఛాన్స్ ఉంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య పరశురామ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus