Mahesh Babu: మహేష్ బాబు రోల్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా చూపించనున్నారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ తొలినాళ్ల నుంచి పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనే నటించారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న పాత్రల్లో మహేష్ బాబు ఎక్కువగా నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. అయితే త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో మహేష్ బాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. వైరల్ అవుతున్న ఈ వార్త సినిమాపై అంచనాలను పెంచుతోంది.

మహేష్ బాబును నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూడాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. అయితే మహేష్ అలా నెగిటివ్ షేడ్స్ లో కనిపించడానికి సంబంధించిన అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ సమయంలో రివీల్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అటు పూజా హెగ్డే రోల్ కు, ఇటు శ్రీలీల రోల్ కు సమాన స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

మహేష్ పూజా హెగ్డే జోడీని ఇప్పటికే చూసిన ప్రేక్షకులు మహేష్ శ్రీలీల జోడీని చూడటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందిస్తోంది. మహేష్ సాధారణంగా ప్రతి సినిమాలో ఒకే తరహా లుక్ లో కనిపిస్తారని ఒక విమర్శ ఉంది. అయితే ఈ సినిమాలో మాత్రం మహేష్ లుక్ సైతం కొత్తగా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ బాబు (Mahesh Babu) వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో కెరీర్ ను కొనసాగిస్తుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం సక్సెస్ సాధిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ బాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మహేష్ తర్వాత మూవీ జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus