Mahesh Babu New Look: షర్ట్ తీసేసిన సూపర్ స్టార్.. ఫొటో షేర్ చేసిన నమ్రత!

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు సినిమాల్లో సన్నివేశాలకు అనుగుణంగా షర్ట్ విప్పి తమ బాడీను చూపిస్తుంటారు. ఇక సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ ఉన్న హీరోలైతే కావాలని తమ బాడీను చూపించే సన్నివేశాలను అడిగి మరీ పెట్టించుకుంటారు. సాంగ్స్ లో, యాక్షన్ సీన్స్ లో తమ బాడీను ఎక్స్ పోజ్ చేసే సీన్స్ లో నటిస్తుంటారు. ఈ ట్రెండ్ చాలా కాలం క్రితమే టాలీవుడ్ లో మొదలైంది. ‘దేశముదురు’ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడు.

అప్పటినుంచి టాలీవుడ్ లో హీరోలు సిక్స్ ప్యాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రెండ్ లో చాలా మంది స్టార్ హీరోలు తప్పనిసరిగా అయినా.. బాడీ పెంచి ఆన్ స్క్రీన్ షర్ట్ విప్పి కనిపించక తప్పలేదు. ఇక ఇప్పటి జెనరేషన్ హీరోలైతే వచ్చీరాగానే తమ బాడీ ఫిట్ నెస్ తో పలకరిస్తున్నారు. ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ నడుస్తున్నప్పటికీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు ఆన్ స్క్రీన్ షర్ట్ లెస్ పోజులతో కనిపించలేదు.

మధ్యలో ఓసారి సిక్స్ ప్యాక్ ట్రై చేశారాయన. కానీ దాని కారణంగా మోహంలో ఏదో మార్పు వస్తుండడంతో ఆపేసినట్లు మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. ఇక సినిమాల్లో అప్పుడప్పుడు షర్ట్ బటన్ తీసి బాడీ షేప్స్ చూపించే ప్రయత్నం చేశారు మహేష్. కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. లుంగీ లుక్ లో మాత్రం ఫ్యాన్స్ ను అలరించారు.

ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు మహేష్ బాబు ఫిట్ బాడీ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది నమ్రత. మహేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో ఉండగా.. కొన్ని ఫొటోలను తీసిన నమ్రత.. కొన్ని శనివారం ఉదయాలు ఇలానే ఉంటాయ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలానే ‘టూ కూల్ ఫర్ ది పూల్’ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది. నమ్రత షేర్ చేసిన ఈ ఫొటోలకు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus