Mahesh Babu Remuneration: పారితోషికం విషయంలో మహేష్ అలా చేయనున్నారా?

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ కు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు లేవనే సంగతి తెలిసిందే. ఒక సమస్య పరిష్కారం అయ్యే సమయంలోపు మరో సమస్య ఎదురవుతూ ఉండటంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పూజా హెగ్డే వల్ల ఈ మూవీ షూట్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది మొదలవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజమౌళి మహేష్ కాంబో మూవీకి సంబంధించి షాకింగ్ అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే.

విదేశాల్లో ఈ సినిమాను షూట్ చేయనున్నామని తాజాగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే రాజమౌళి సినిమాకు మహేష్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది. ఈ రీజన్ వల్లే రాజమౌళి సినిమాకు రెమ్యునరేషన్ కు బదులుగా కలెక్షన్లలో వాటా తీసుకోవాలని మహేష్ భావిస్తున్నారని బోగట్టా.

భవిష్యత్తు సినిమాలకు కూడా మహేష్ బాబు ఇదే విధానాన్ని ఫాలో కానున్నారని సమాచారం అందుతోంది. రెమ్యునరేషన్ విషయంలో మహేష్ ఫాలో అవుతున్న రూట్ ఒక విధంగా కరెక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల సినిమా ఫ్లాపైనా నిర్మాతపై నష్టాల భారం తగ్గుతుంది. రాజమౌళి సినిమాలో నటించడానికి మహేష్ తెగ ఆసక్తి చూపిస్తుండగా ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించనున్నారని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కాగా వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా షూట్ మొదలుకానుంది. మహేష్ త్రివిక్రమ్ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని రాజమౌళి సూచనలు చేశారని సమాచారం.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus