Mahesh Babu: తండ్రికి గౌరవార్ధం మహేష్‌ ఆ నిర్ణయం తీసుకున్నాడా?

తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ గురించి.. మహేష్‌ బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇండస్ట్రీకి కృష్ణ చేసిన సేవలను కొనసాగించే దిశగా.. కొత్త తరం సినీ జనాలకు ఆయన పేరు మీద అవార్డు ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తండ్రి పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఏదైనా భారీ కార్యక్రమం చేయాలని మహేష్‌ అనుకుంటున్నారట. ఈ క్రమంలో కృష్ణ పేరు మీద ఓ పురస్కారం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి.

త్వరలోనే దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మే 31న కృష్ణ జన్మదినం సందర్భంగా ఏటా ఆ తేదీన ఈ అవార్డును ఇవ్వాలని మహేష్‌ అనుకుంటున్న సమాచారం వస్తోంది. ఏటా చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు ఈ పురస్కారం ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. నిజానికి టాలీవుడ్‌లో ఇలాంటి పురస్కారాలు కొత్తేమీ కాదు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ పేరు మీద ఇప్పటికే ఇలాంటి అవార్డులు ఉన్నాయి.

ఎన్టీఆర్ అవార్డు ప్ర‌భుత్వ‌మే ఇచ్చేది. ఏఎన్నార్ ది ప్రైవేటు అవార్డు. అయితే అవి ఇప్పుడు రెగ్యులర్‌గా ఇవ్వడం లేదు. దీంతో కృష్ణ అవార్డు ప్రారంభించి రెగ్యులర్‌గా ఇవ్వాలని అభిమానులు కూడా కోరుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కృష్ణ జ్ఞాపకార్థం స్మారక స్థూపాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ విషయంలోనూ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే అవార్డుల సంగతి కూడా తెలుస్తుంది అంటున్నారు.

కృష్ణ అంత్య‌క్రియ‌ల విష‌యంలో మ‌హేష్ బాబుపై విమ‌ర్శ‌లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ అవార్డు నిర్ణయంతో అభిమానులు హ్యాపీ అని చెప్పొచ్చు. మ‌హా ప్ర‌స్థానంలో కృష్ణ ద‌హ‌న సంస్కారాలు చేయ‌డం అభిమానులు హ‌ర్షించ‌లేదు. పరిశ్రమలో కొంతమంది కూడా ఈ విషయం అసంతృప్తి వ్యక్తం చేశారు అని కూడా అటారు. ఇప్పుడు కృష్ణ పేరుతో శాశ్వ‌తంగా గుర్తుండిపోయేలా అవార్డు ఇవ్వాలి అనుకోవడం పెద్ద విషయమే అని చెప్పాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus