సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమైంది. సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఎక్కువ సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు రీసెంట్ గా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. షూటింగ్ మొదలుపెట్టడంతో పాటు సినిమా బిజినెస్ వ్యవహారాలను కూడా హ్యాండిల్ చేసినట్లు సమాచారం. డీల్స్ ఏవీ ఫైనల్ చేయలేదు కానీ డిస్కషన్స్ మాత్రం జరుగుతున్నాయి. నిర్మాతలు కోట్ చేస్తున్న రేట్లు వింటుంటే షాకింగ్ గానే ఉంది.
ఓవర్సీస్ రైట్స్ కోసం రూ.23 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఇంత మొత్తంలో రైట్స్ అమ్ముడవుతాయా..? లేదా..? అనేది సందేహమే. నిర్మాతలు మాత్రం ఇరవై మూడు కోట్లు కోట్ చేశారట. దక్షిణాది నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్ కోసం కోట్ చేస్తున్న మొత్తం రూ.100 కోట్లు. టాప్ ఓటీటీ సంస్థతో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ను ఇంకా బేరం పెట్టలేదు. ఒక్కసారి హిందీ వెర్షన్ ఉందనేది డిసైడ్ అయితే అప్పుడు బిజినెస్ మాట్లాడతారు.
ఆడియో రైట్స్ రూపంలో కూడా భారీ మొత్తం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే.. నైజాం ఏరియా రూ.45 కోట్ల రేంజ్ లో ఉంటుందట. ఎందుకంటే అక్కడ ‘అల.. వైకుంఠపురములో’ సినిమా రూ.42 కోట్లకు పైగా వసూలు చేసింది. అదే రేంజ్ లో మహేష్ సినిమాకి బేరం పెట్టారు. ఆంధ్రాలో రూ.50 కోట్లకు సినిమాను అమ్మాలని చూస్తున్నారు.
సీడెడ్ రూ.20 కోట్ల రేంజ్ లో కోట్ చేస్తున్నారు. నిర్మాతలైతే.. థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.140 కోట్ల వరకు బిజినెస్ ఆశిస్తున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలుపుకొని మరో రూ.140 కోట్లకు కోట్ చేస్తున్నారు. మరి వీరు ఆశిస్తున్నట్లుగా బిజినెస్ జరుగుతుందో.. లేదో.. చూడాలి!