SSMB28: డిసెంబర్ నుంచి మహేష్ షూటింగ్ కి రెడీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో తన జీవితంలో కీలకమైన వ్యక్తులను పోగొట్టుకున్నారు. ముందుగా మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణించిన కొన్ని నెలలకే మహేష్ తల్లి కన్నుమూశారు. ఈ దుఃఖం నుంచి మహేష్ బయటకురాకముందే అతడి తండ్రి కృష్ణ చనిపోయారు. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం మహేష్ బాబు.. దర్శకుడు త్రివిక్రమ్ కి ఫోన్ చేశారట. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఆరు రోజులపాటు ఈ సినిమా షూటింగ్ చేసిన తరువాత మహేష్ తల్లి ఇందిరా దేవి మరణించడంతో షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు కృష్ణగారు మరణించడంతో.. ఇక మహేష్ షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే సడెన్ గా మహేష్ నుంచి త్రివిక్రమ్ కి ఫోన్ రావడంతో ఆయన షాక్ అయ్యారట. త్రివిక్రమ్ తో మాట్లాడిన మహేష్ బాబు షూటింగ్ మొదలు పెడదామని చెప్పారట.

దానికి త్రివిక్రమ్ కొంత సమయం తీసుకోమని మహేష్ బాబుకి చెప్పినా.. ఆయన మాత్రం డిసెంబర్ 8 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయమని చెప్పారట. అప్పటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మహేష్ రెడీగా ఉంటారు. షూటింగ్ కి ఇంత గ్యాప్ ఇస్తే నిర్మాతలు ఎంత నష్టపోతారో మహేష్ కి బాగా తెలుసు. తన కారణంగా వారు ఇబ్బంది పడకూడదని షూటింగ్ కి వస్తానని చెప్పారు.

మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు దర్శకనిర్మాతలు షూటింగ్ కి సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుంది. మొదట యాక్షన్ సన్నివేశాలతో షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు మాత్రం కొన్ని డ్రామా సీన్స్ ను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus