SSMB28: మహేష్-త్రివిక్రమ్ ల కొత్త సినిమా టైటిల్ పోస్టర్ వచ్చేస్తుంది..!

అవును మహేష్ బాబు – త్రివిక్రమ్ ల కొత్త సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. ఇప్పటివరకు ‘ఎస్.ఎస్.ఎం.బి 28’ అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈ మూవీ ప్రచారంలో ఉంది.ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొదలైంది. మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల,రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ వంటి వారు ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. ఈ ఒక్క షెడ్యూల్ కే రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా.. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ప్రతి అప్డేట్.. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు అయిన మే 31వ తేదీకి ఇస్తుంటారు. కానీ గత ఏడాది నవంబర్ 15న కృష్ణగారు మరణించడం జరిగింది. దీంతో ఇక ఆయన పుట్టినరోజు నాడు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వబోరని స్పష్టమవుతుంది. మహేష్ బాబు తన సెంటిమెంట్ కూడా మార్చుకున్నట్టే అనే టాక్ వినిపిస్తోంది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్- త్రివిక్రమ్ ల నెక్స్ట్ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ ఉగాదికి అంటే మార్చి 22 కి విడుదల చేయబోతున్నారు అని తెలుస్తుంది.ఎక్కువ శాతం ఈ డేట్ కే టీం అంతా ఓటేసినట్టు సమాచారం. ఒకవేళ ఆ టైంకి మిస్ అయితే ఏప్రిల్ నెలలో కచ్చితంగా టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని సమాచారం.

మహేష్ అభిమానులకు ఓ రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus