Mahesh: ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ పై స్పందించిన మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోయే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా తన సినిమాలతో బిజీగా ఉండే మహేష్ బాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఈయన ఎన్నో విషయాల గురించి స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈయన హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్నందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు.

ఈ మేరకు ట్విట్టర్లో ఒక వీడియోని పోస్ట్ చేసిన మహేష్ బాబు హైదరాబాదులో ఫార్ములా ఈ వర్డ్ ఛాంపియన్షిప్ జరగడం ఎంతో గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి అవ్వాలని ఈయన ఆకాంక్షించారు. ఇక మహేష్ బాబు గ్రీన్ కో కంపెనీ సీఈవో అనిల్ చలం శెట్టిపై కూడా ప్రశంసలు కురిపించారు.ఫిబ్రవరి 11న జరుగునున్న ఈ ఈవెంట్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ఈ వేడుక చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించాలని ఈయన ఆకాంక్షించారు.

ఇక ఫిబ్రవరి 11న జరగబోయే ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ రేస్ కి సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. బుక్ మై షో ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. అయితే కేటగిరి వారిగా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ రేసింగ్ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. ఈ రేసింగ్ టికెట్ ధరలు వేయి రూపాయలు,రూ.3500, రూ.10,000 గా నిర్ణయించారు. ఇలా ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ రేస్ గురించి మహేష్ బాబు స్పందిస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus