Mahesh Babu: మహేష్ మూవీ ఇంటర్వెల్ సీన్ అలా ఉంటుందా?

పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోయిన్లుగా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన సర్కారు వారి పాట టీజర్ రికార్డులను క్రియేట్ చేయగా ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కు సంబంధించి నెట్టింట ఒక వార్త వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉంటుందని సమాచారం.

అటు మాస్ ఫ్యాన్స్ ను ఇటు క్లాస్ ఫ్యాన్స్ ను మెప్పించేలా ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. సింహాచలం దేవాలయం బ్యాక్ డ్రాప్ లో ఇంటర్వెల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇంటర్వెల్ సీన్ లో వరాహవతారంలో మహేష్ కనిపించనున్నారని సమాచారం. మహేష్ గతంలో ఒక సినిమాలో కొన్ని సెకన్ల పాటు కృష్ణుని పాత్రలో కనిపించిన మహేష్ ఆ తర్వాత పౌరాణిక పాత్రలో కనిపించలేదు. ఇంటర్వెల్ సీన్ లో మహేష్ బాబు సముద్రఖని కాంబినేషన్ సీన్లు వస్తాయని తెలుస్తోంది.

అయితే మహేష్ బాబుకు పౌరాణిక గెటప్ సూట్ కాదని చాలామంది భావిస్తారు. ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి ఫిక్స్ కావడంతో సర్కారు వారి పాట రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. సర్కారు వారి పాట ఎప్పుడు విడుదలైనా మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని భావిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాతో పరశురామ్ స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus