Mahesh Babu, Krishna: కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ దంపతులు!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నేడు 80 వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఆయనకు సినీ ప్రముఖుల నుంచి అభిమానులను సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే ఎంతో మంది సూపర్ స్టార్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కృష్ణ గారితో తనకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రికి ఎమోషనల్ ట్వీట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన తండ్రికి హ్యాపీ బర్త్ డే నాన్న.. నిజంగా చెబుతున్న మీలా ఎవరూ ఉండరు..మీరు ఇంకా మరింత సంతోషంగా, ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యూ నాన్న అంటూ అంటూ కృష్ణ గారికి మహేష్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహేష్ బాబు మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు సైతం కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సుధీర్ బాబు, మహేష్ బాబు భార్య నమ్రత తన మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నమ్రత స్పందిస్తూ హ్యాపీ బర్త్ డే మామయ్య.. మీరిచ్చిన ఆనందం, నవ్వు, ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని. నా భర్తకు తండ్రిలాగే నాకు కూడా తండ్రిగా ప్రేమను పంచినందుకు ధన్యవాదాలు మేము మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను

అంటూ నమ్రత తన మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.నేడు సూపర్ స్టార్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు సైతం పెద్దఎత్తున కృష్ణ గారి ఫోటోలు షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus