ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు వ్యాపారాలు చేయడం కొత్తేమీ కాదు. చాలా మందికి సైడ్ బిజినెస్ లు ఉన్నాయి. రీసెంట్ గానే అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పటికే థియేటర్ బిజినెస్ ను మొదలుపెట్టిన మహేష్ బాబు ఇప్పుడు మరో కొత్త బిజినెస్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తో ఆనల్ లైన్ చదువులకు బాగా డిమాండ్ పెరిగింది. చాలా ఎడ్యుకేషనల్ యాప్స్ పుట్టుకొచ్చాయి.
వీటిలో బైజూస్ లాంటి ఒకట్రెండు లెర్కింగ్ యాప్స్ బాగా క్లిక్ అయ్యాయి. బైజూస్ కి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాంటిదే మరో లెర్నింగ్ యాప్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు. సీనియర్ కేజీ విద్యార్థుల నుంచి పదో తరగతి, ఇంటెర్మీడియట్ స్టూడెంట్స్ వరకు అందరికీ పనికొచ్చేలా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే ఓ యాప్ ను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. మహేష్ బాబుకి ఇప్పటికే ఓ బ్యానర్ ఉంది. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తుంటాయి. దీంతో ‘ది హంబుల్’ అనే డిజైనర్ వేర్ బిజినెస్ కూడా ఉంది. ఏషియన్ సంస్థతో కలిసి ఏఎంబీ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త బిజినెస్ కి శ్రీకారం చుడుతున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?