సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB29 చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా పూజా కార్యక్రమాలు చాలా రహస్యంగా జరిగిన విషయం తెలిసిందే. ఎలాంటి ఫొటోలు కానీ, వీడియోలు కానీ బయటకు రాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, షూటింగ్ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
SSMB29
ఇటీవల రాజమౌళి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఈ సినిమాపై మరింత చర్చనీయాంశమైంది. పాస్‌పోర్ట్ పట్టుకుని నవ్వుతూ కనిపించిన రాజమౌళి, బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్ బాబు స్పైడర్ మూవీ మ్యూజిక్ వినిపించడంతో, ఇది SSMB29 గురించి పరోక్షంగా హింట్ ఇవ్వడం అనుకున్నారు అభిమానులు. మహేష్ కూడా సరదాగా “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అంటూ కామెంట్ చేయడం, వీరిద్దరి చిట్‌చాట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది.
తాజాగా SSMB29 సినిమా వర్క్ షాప్ లో పాల్గొన్న మహేష్ బాబు పిక్ ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. ఈ ఫోటోలో మహేష్ బాబు బ్లూ టీషర్ట్ ధరించి చాలా హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఫుల్ యాక్టివ్ మూడ్‌లో ఉన్న సూపర్ స్టార్ పిక్ చూసిన ఫ్యాన్స్, బాబు సూపర్ అంటూ పాజిటివ్ గా అంటూ కామెంట్లు చేస్తున్నారు. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, హైదరాబాద్ లింగంపల్లి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రాజమౌళి ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో మహేష్ బాబు సహా మరికొందరు కీలక నటీనటులు పాల్గొన్నారని టాక్. రాజమౌళి ప్రతి సినిమాకి వర్క్ షాప్ నిర్వహించడంలో ప్రత్యేకత ఉన్నా, SSMB29 వర్క్ షాప్ ప్రత్యేకమైనదని తెలుస్తోంది. ఈ లేటెస్ట్ పిక్, మేకర్స్ విడుదల చేయకుండానే వైరల్ అవ్వడంతో, సినిమా సంబంధిత అప్డేట్స్ త్వరగా వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. మహేష్ బాబు లుక్ చూసి ముచ్చటపడుతున్న ఫ్యాన్స్, ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి రాజమౌళి, మహేష్ కాంబినేషన్ ఏ రేంజ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.