పాతిక కోట్లు తీసుకొని ‘బ్రహ్మోత్సవం’ నుండి పక్కకు తప్పుకున్న మహేష్!!
- February 20, 2016 / 10:25 AM ISTByFilmy Focus
‘శ్రీమంతుడు’ సినిమా తో భారీ ఘన విజయాన్ని అందుకున్న మహేష్ తన తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడనే విషయం మనకి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి ఉన్న నిర్మాతలలో మహేష్ బాబు ఒకరు, మరో నిర్మాత ప్రసాద్ వి పోరుట్ల అన్న విషయం కూడా మనందరికీ విదితమే. తాజాగా ఈ సినిమా నిర్మాణ హక్కులు మహేష్ బాబు వదులుకున్నాడనే ఒక బలమైన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో తెగ చెక్కర్లు కొడుతుంది. మహేష్ బాబు కి ఇంత అని ఒక రేట్ ఫిక్స్ చేసి, సినిమాపై హక్కుల్ని మరో నిర్మాత ప్రసాద్ వి పోరుట్ల సొంతం చేసుకున్నాడని ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తునాయి.వివరాల లోకి వెళితే….
‘శ్రీమంతుడు’ సినిమాకి భారీగా షేర్స్ రావడం తో, ‘బ్రహ్మోత్సవం’ దానికన్నా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో మరో నిర్మాత పి. వి. పి మహేష్ బాబు కి 25 కోట్లు ముట్టచెప్పి తనని సైడ్ చేసాడని, ఆర్ధిక వ్యవహారాలన్నీ తనే స్వయంగా చూసుకుంటున్నాడని ఇండస్ట్రీ లో వినికిడి. సినిమా ఎంత హిట్ అయిన వచ్చే షేర్ 25 కోట్లకు అటో ఇటో ఉంటుంది కాబట్టి తనకొచ్చిన నష్టం ఏమి లేదూ కాబట్టి మహేష్ కూడా ఈ డీల్ కి ఒప్పుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంట్టునాయి. ‘శ్రీమంతుడు’ సినిమా కన్నా ఎక్కువ చెల్లించి బయ్యర్లు ఈ సినిమాను ఎగరేసుకుపోతున్నారు. సినిమా హిట్ అయిన ఫట్ట్ ఐన మహేష్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాడని మనకి అర్ధం అవుతుంది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















