బ్రహ్మోత్సవం సినిమా అపజయం పాలవడంతో ఎలాగైనా హిట్ సాధించాలని మహేష్ బాబు కష్టపడ్డారు. మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ మూవీ కోసం ఏడాది పాటు శ్రమించారు. కానీ ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. కలక్షన్స్ వందకోట్లు దాటినప్పటికీ బడ్జెట్ చేతికి రాలేదు. దీంతో నిర్మాత ఎన్వీ ప్రసాద్ కి బాగా నష్టాలొచ్చాయి. అసలే కోలీవుడ్ ఎంట్రీ బాగాలేదని విచారంలో ఉన్న మహేష్ కి ఈ నష్టం మరింత బాధ కలిగించింది. కొన్ని రోజులు విదేశాలకు వెళ్లినా స్పైడర్ ఫెయిల్ వెంటాడుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ కి వచ్చిన మహేష్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ని ఇంటికి పిలిచి మాట్లాడినట్టు తెలిసింది.
నష్టాన్ని పూడ్చే మార్గం కోసం చర్చించినట్లు సమాచారం. స్పైడర్ కోసం మహేష్ 23 కోట్లు తీసుకున్నారు. ఇందులో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేయడానికి సిద్ధమయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అయితే అది ఇప్పుడు కాదంట, భరత్ అను నేను రిలీజ్ సమయంలో ఇస్తానని మాట ఇచ్చినట్లు ట్రేడ్ వర్గాల వారు వెల్లడించారు. గతంలో ఖలేజా ఫెయిల్ అవ్వడంతో రెమ్యూనరేషన్లో సగభాగం తిరిగి ఇచ్చి నిర్మాతను ఆదుకున్న మహేష్ ఇప్పుడు మళ్ళీ నిర్మాతకు అండగా నిలిచి నిజమైన సూపర్ స్టార్ అనిపించుకున్నారు.