Mahesh: అలాంటి ప్రయోగం చేయబోతున్న మహేష్.. కానీ?

మరికొన్ని గంటల్లో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా ఆగష్టు నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపుగా ప్రతి సినిమాలో ఒకే తరహా లుక్ లో కనిపిస్తారని కొంతమంది కామెంట్ చేస్తారు. అయితే ఈ సినిమాలో మాత్రం మహేష్ కొత్త లుక్ లో కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

పొడవాటి జుట్టుతో మహేష్ ఈ సినిమాలో కనిపిస్తారని సమాచారం. రెట్రో లుక్ లో సన్నని గడ్డంతో మహేష్ కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ లుక్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో కూడా మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా త్రివిక్రమ్ 30 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు.

ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. కొన్నిరోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు, తమిళ భాషల్లోని క్రేజీ సినిమాల హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. నెట్ ఫ్లిక్స్ సౌత్ ఇండియాలో ఊహించని స్థాయిలో సబ్ స్క్రైబర్లను పెంచుకోవాలని భావిస్తుండగా

నెట్ ఫ్లిక్స్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, ఆహా ఓటీటీలకు నెట్ ఫ్లిక్స్ గట్టి పోటీ ఇస్తోంది. నెట్ ఫ్లిక్స్ దూకుడు చూసి ఇతర ఓటీటీల నిర్వాహకులు షాకవుతున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus