“పొగతాగడం ఆరోగ్యానికి హానికరం…” ప్రతి సినిమా ప్రారంభంలో ఈ హెచ్చరిక వినిపిస్తుంటుంది. హీరోలను చూసి యువత అందుకు బానిస అవుతారని ఇలా చెబుతుంటారు. అయితే ఒక సారి ధూమపానానికి అలవాటు పడితే మానడం చాలా కష్టం. తల్లిదండ్రులు చెప్పిన వినరు. అదే రీతిన సూపర్ స్టార్ మహేష్ యవ్వనంలో ఉండేవారు. రోజుకు ఒకటి కాదు రెండు కాదు.. ప్యాక్ మొత్తం కాల్చేవారు. చైన్ స్మోకర్ గా పేరు కూడా వచ్చింది. అలా తాగొద్దని తండ్రి కృష్ణ చెప్పిన ప్రిన్స్ వినలేదు. ఈ విషయాన్నీ మహేష్ స్వయంగా చెప్పారు.
ఆ చెడు అలవాటు మానడానికి ప్రధాన కారణం నమ్రత అని తెలిసింది. ఇప్పుడు సూపర్ స్టార్ సిగరెట్ జోలికి వెళ్లడం లేదు. అంతలా తనను నమ్రత మార్చిందని, కస్టపడి కౌన్సలింగ్ ఇచ్చిందని మహేష్ రీసెంట్ గా వెల్లడించారు. “ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్” అనే పుస్తకం కూడా తాను మళ్లీ సిగరెట్ ముట్టకుండా చేసేందుకు దోహదపడిందని వివరించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారు. వారు కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడరు. మహేష్ జీవితంలో నమ్రత ఆ స్పెషల్ పర్సన్ అని ఈ సంఘటన ద్వారా అందరికీ అర్ధమయ్యే ఉంటుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.