అలా చేస్తే ఇండస్ట్రీనీ కాపాడుకోవచ్చు: అడివి శేష్

విలక్షణ నటుడు అడవి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి, క్షణం వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఇటీవల మేజర్ అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ నటుడిగా తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు. ఈ మేజర్ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఇండియా లెవెల్ లో విడుదల అవుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఫస్ట్ లుక్ సినిమా మీద ప్రేక్షకుల అంచనాలను పెంచుతున్నాయి. అయితే కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కూడా నష్టపోవడం వల్ల సినిమా టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు సినిమా టికెట్ల ధరలను పెంచాయి. కానీ మేజర్ సినిమా టికెట్లు ధరల గురించి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల దిల్ రాజు నిర్మించిన ఎఫ్3 సినిమా టికెట్ల రేట్లు పెంచడం లేదని ఆయన అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మేజర్ సినిమా కూడా ఎఫ్ 3 బాటలో వెళ్తూ పాత ధరలకే సినిమా టికెట్ల విక్రయిస్తుంది. ఈ విషయాన్ని హీరో అడివి శేష్ అధికారికంగా ప్రకటించాడు. ఇటీవల ‘ఆస్క్‌ శెష్‌’ పేరుతో సోషల్ మీడియాలో నిర్వహించిన సెషన్‌లో ఓ అభిమాని..టికెట్ల రేట్ల పెంపు గురించి మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధరను తగ్గిస్తే, ఆడియన్స్ రిపెటెడ్ గా సినిమా చూసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా టికెట్ రెట్లు తగ్గించటం వల్ల రిపీటెడ్‌ ఆడియన్స్‌ పెరిగి ఇండస్ట్రీని కూడా కాపాడుకోవచ్చు కదా అని కామెంట్స్ చేశాడు.

అడవి శేషు దీనికి వెంటనే స్పందిస్తూ… మేజర్ ‌సినిమా టికెట్ రేట్లు పెంచలేదని. ఈ సినిమాకు సాధారణ రేట్లకే ప్రేక్షకులకి టికెట్లు అందుబాటులో ఉంటాయని శేషు అధికారికంగా ప్రకటించాడు. దీంతో అభిమానులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. .

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.