Malaika: మలైకా ‘ఎస్’ చెప్పింది ఎవరికంటే..?

బాలీవుడ్ ముద్దుగుమ్మ మలైకా అరోరా.. దశాబ్దంన్నర పాటు వైవాహిక జీవితం సాగించిన తరువాత విడాకులు తీసుకుంది. ఆమె విడాకులు తీసుకోవడానికి కారణం అర్జున్ కపూర్ అని అప్పట్లో వార్తలొచ్చాయి. దానికి తగ్గట్లే అర్జున్ కపూర్ తో రిలేషన్ మొదలుపెట్టింది మలైకా. ఆమె కంటే వయసులో అర్జున్ పన్నెండేళ్లు చిన్నవాడు. దీంతో బాలీవుడ్ లో వీరి ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది. తరచూ వీరిద్దరూ కలిసి ట్రిప్స్ కి వెళ్తూ.. మీడియా కంట పడుతుంటారు.

ఇద్దరూ ఓపెన్ గానే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేస్తుంటారు. వీరిద్దరూ కలిసే ఉంటున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలానే ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారనే మాటలు గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేసేలా మలైకా ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ‘I said Yes’ అంటూ ఒక క్యాప్షన్ తో ఫొటో షేర్ చేసింది. ఇది చూసిన జనాలు అర్జున్ కపూర్ ని పెళ్లి చేసుకోవడానికి మలైకా ఓకే చెప్పిందని అనుకున్నారు.

త్వరలోనే వీరి పెళ్లి వేడుకను చూడబోతున్నామని నెటిజన్లు పోస్ట్ లు పెట్టారు. మీడియాలో కూడా ఈ పోస్ట్ పై వార్తలొచ్చాయి. కానీ అసలు విషయం వేరే ఉంది. మలైకా హాట్ స్టార్ కోసం ‘మూవింగ్ ఇన్ విత్ మలైకా’ అనే షో చేయబోతుంది. ఈ షోకి ఆమె ఓకే చెప్పడం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందట. అసలు విషయాన్ని నేరుగా చెప్పకుండా పబ్లిసిటీ కోసం ఆమె ఇలా చేసిందని తెలుస్తోంది. ఆమె ఆశించినట్లుగానే పోస్ట్ కి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది.

మొత్తానికి అందరినీ బాగానే ఫూల్స్ చేసింది మలైకా. మరి నిజంగానే అర్జున్ కపూర్ ని ఎప్పుడు పెళ్లాడుతుందో చూడాలి. ఇప్పటికే మలైకా 50ల్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మళ్లీ అర్జున్ ని పెళ్లాడితే ఈసారి ట్రోలింగ్ మాములుగా ఉండదేమో!

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus