ఈత రాకపోయినా స్విమ్మింగ్‌ సీన్‌.. అలా ఎలా చేస్తారబ్బా?

ఈత కొట్టడం చాలా సరదాగా ఉంటుంది. కానీ ఈత రాకుండా స్విమ్మింగ్‌ చేయడానికి చాలా రిస్క్‌. అది ఏ వయసు వారికైనా, ఎక్కడి వారికైనా. అయితే ఇంత తెలిసినా ఓ సినిమా టీమ్‌ హీరోయిన్‌తో స్విమ్మింగ్‌ చేసే సీన్‌ షూట్ చేయించింది. అన్నీ అనుకున్నట్లుగా చక్కగా ఆ సీన్‌ షూట్‌ అయిపోయింది అనుకోండి. ఈ విషయాన్ని ఆ సినిమా హీరోయినే చెప్పుకొచ్చింది. ‘ఈత రాకపోయినా స్విమ్మింగ్‌ సీన్‌’ చేశాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Malavika Manoj

ఆమెనే ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా హీరోయిన్‌ మాళవిక మనోజ్‌ (Malavika Manoj). సుహాస్‌ హీరోగా రామ్‌ గోదల తెరకెక్కించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ ఇందులో సత్యభామగా అనే పాత్రలో మాళవిక మనోజ్‌ (Malavika Manoj) నటించింది. ఈ సినిమా ఈ నెల 11న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌ మీడియాతో మాట్లాడింది. సత్యభామ పాత్ర నా నిజ జీవితానికి దూరంగా ఉంటుంది.

తెలుగులో తొలి అడుగులోనే ఇలాంటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. ఈ క్రమంలో తనకు ఈత రానప్పటికీ ఈ సినిమాలో ఓ సీన్‌ కోసం భయపడుతూనే నీళ్లలో దూకి స్విమ్‌ చేశాను అని చెప్పింది. తనకెప్పుడూ వైవిధ్యభరితమైనని, సవాల్‌ విసిరే పాత్రలు చేయాలని ఉంటుందని.. ప్రతి సినిమాలోనూ రొటీన్‌ పాత్రలే చేస్తే ప్రేక్షకులకే కాదు, నాకు కూడా బోర్‌ కొట్టేస్తుందని ఫ్యాన్స్‌ పల్స్‌ పట్టేసిన సీనియర్‌ హీరోయిన్‌లా చెప్పింది.

ఇక తమిళ చిత్రం ‘జో’లో చూసి ఈ సినిమా కోసం అప్రోచ్‌ అయ్యారట. ఇదంతా ఓకే కానీ.. స్విమ్మింగ్‌ రాని హీరోయిన్‌తో ఆ సీన్‌ ఎలా తీస్తారబ్బా. అయితే సినిమా టీమ్‌ తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటుంది. ప్రతి సినిమా సెట్స్‌లో ఇలాంటి జాగ్రత్తలు ఉంటాయనుకోండి. కానీ ఇది కాస్త రిస్క్‌ వ్యవహారమే కదా.

‘THE’ ట్యాగ్‌ స్పందించిన విజయ్‌ దేవరకొండ.. ఏమన్నాడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus