మలయాళ నటుడి అనుమానాస్పద మృతి!
- September 11, 2021 / 07:31 PM ISTByFilmy Focus
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటుడు రమేష్ వలీయశాల(54) సూసైడ్ చేసుకున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్ల అకాల మరణం మరవక ముందే మరో నటుడు మృతి చెందడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. 22 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ సీనియర్ నటుడు సెప్టెంబర్ 11న ఉదయం తిరువనంతపురంలోని తన ఇంట్లో ఉరేసుకొని మరణించారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, ఫ్యామిలీ సభ్యులు షాక్ తిన్నారు.

రెండు రోజుల క్రితమే రమేష్ వలీయశాల షూటింగ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చారని.. అలాంటిది ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని కనిపించడంతో అతడి సహ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా రమేష్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ పోస్ట్ లు పెడుతున్నారు. కేరళ పరిశ్రమలో వరుసగా సీరియల్స్, సినిమాలు చేస్తూ నటుడిగా బిజీగా ఉండే రమేష్ వలీయశాల ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!











