Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు
- January 20, 2026 / 04:47 PM ISTByPhani Kumar
సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana ShankaraVaraprasad Garu) బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్‌లో రివ్యూ ఇచ్చారు. సినిమాపై బన్నీ పెట్టిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Mana ShankaraVaraprasad Garu
సినిమా చూసిన తర్వాత బన్నీ ఫుల్ ఖుషీ అయ్యారు. “ది బాస్ ఈజ్ బ్యాక్.. లిట్ (LIT)” అంటూ తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. మెగాస్టార్‌ను స్క్రీన్ మీద చూస్తుంటే ఫుల్ వింటేజ్ వైబ్స్ వచ్చాయని, ఆయన ఎనర్జీతో స్క్రీన్ వెలిగిపోయిందని ఆకాశానికెత్తేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరు మ్యానరిజమ్స్ ఫ్యాన్స్‌కి పండగే అని తేల్చేశారు.ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన విక్టరీ వెంకటేష్‌ను ఉద్దేశించి బన్నీ చేసిన కామెంట్ హైలైట్‌గా నిలిచింది.

సినిమాలో వెంకీ కర్ణాటక బిజినెస్‌మెన్‌గా కనిపించడంతో.. “వెంకీ మామ రాక్డ్ ది షో” అంటూ కన్నడలో “తుంబా చెన్నైగి మాడిదిరా” (చాలా బాగా చేశారు) అని ట్వీట్ చేయడం విశేషం.నయనతార గ్రేసియస్ ప్రజెన్స్, కేథరిన్ కామెడీ టైమింగ్‌ని కూడా బన్నీ మెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘సంక్రాంతి స్టార్ బుల్లిరాజు’ (కోరికతాను కోరికతాను) క్యారెక్టర్ ఎనర్జీ అదిరిపోయిందన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాటలు థియేటర్లో విజిల్స్ వేయించేలా ఉన్నాయని కితాబిచ్చారు.చివరగా దర్శకుడు అనిల్ రావిపూడిని “సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మెషీన్” అని వర్ణిస్తూ బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సంక్రాంతికి వస్తారు – హిట్ కొడతారు – రిపీటూ” అంటూ రైమింగ్ కలిపారు. అంతేకాదు, ఇది కేవలం సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు.. “సంక్రాంతి బాస్-బస్టర్ (BOSS-buster)” అంటూ బన్నీ ఇచ్చిన కొత్త ట్యాగ్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తోంది.
జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్లలో తగ్గేదేలే అంటోంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటికే రూ.225 కోట్లు క్రాస్ చేసి రీజినల్ ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోతోంది.
















