Manamey Collections: ‘మనమే’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • June 15, 2024 / 02:24 PM IST

శర్వానంద్ (Sharwanand) 35వ చిత్రంగా ‘మనమే’ (Manamey)  ‘సినిమా… జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్ (T. G. Vishwa Prasad) నిర్మించగా వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla)  సహా నిర్మాతగా వ్యవహరించారు. అలాగే విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ ‘క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా’ ఈ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మరోపక్క హీరోయిన్ గా కృతి శెట్టి  (Krithi Shetty) నటించింది. ‘మనమే’ టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ సో సో గానే వచ్చాయి.కానీ 2వ రోజు బాగానే పికప్ అయ్యింది. 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది. కానీ మొదటి సోమవారం నుండి కలెక్షన్లు అమాంతం పడిపోయాయి. అయితే 8వ రోజు స్టడీగానే కలెక్ట్ చేసింది. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.53 cr
సీడెడ్ 0.59 cr
ఉత్తరాంధ్ర 0.74 cr
ఈస్ట్ 0.20 cr
వెస్ట్ 0.12 cr
కృష్ణా 0.64 cr
గుంటూరు 0.44 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.42 cr
 ఓవర్సీస్ 0.87 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  6.74 cr (షేర్)

‘మనమే’ చిత్రానికి రూ.12.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.6.74 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.6.26 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ వీకెండ్ ని గట్టిగా క్యాష్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ ఛాన్సులు ఉండొచ్చు.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus