మహేష్ బాబు ఫ్యాన్స్ ను టార్గెట్ చేసిన మంచు విష్ణు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 45 ఏళ్ళ వయసొచ్చినా సరే.. ఇంకా 25ఏళ్ళ కుర్రాడిలా కల కలలాడిపోతుంటాడు మహేష్. బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం మహేష్ బాబు అందం గురించి మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక మన టాలీవుడ్లో అయితే చిరంజీవి,ఎన్టీఆర్,చరణ్ వంటి స్టార్ హీరోలు కూడా మహేష్ గ్లామర్ ను వర్ణిస్తూ పలు సందర్భాల్లో ప్రస్తావించారు.

ఇక తాజాగా మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు కూడా తనదైన శైలిలో మహేష్ గ్లామర్ పై కామెంట్స్ చేసాడు. ఇటీవల మహేష్, నమ్రత లు మంచు విష్ణు భార్య విరానికా పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. అక్కడ దిగిన ఓ ఫొటోని మంచు విష్ణు తన ట్విట్టర్లో షేర్ చేస్తూ… “ఈ ఫొటోలో ఉన్న ఓ వ్యక్తి.. వయసు పెరిగే కొద్దీ ఇంకా ఇంకా.. కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజురోజుకి ఇంకా ఇంకా అందంగా తయారవుతున్నాడు.

బహుశా ఆయన మంచి తనం, దయా హృదయం వల్లే అయ్యుండొచ్చు. అదే నేను బలంగా నమ్ముతున్నాను’’ అంటూ పేర్కొన్నాడు.విష్ణు ట్వీట్ కు మహేష్ స్పందిస్తూ.. ‘థాంక్యూ.. బర్త్‌డే పార్టీ అదిరిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు. విష్ణు ట్వీట్ పై మహేష్ అభిమానులు.. హర్షం వ్యక్తం చేస్తూ అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus