Manchu Vishnu: కొత్త చర్చకు దారి తీసిన విష్ణు లేటెస్ట్ కామెంట్స్..!

ఇటీవల విష్ణు ఓ టీవీ ఛాన‌ల్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఇందులో మా ఎన్నికల గురించి అతను కొన్ని తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ మధ్య కాలంలో అతను తరచూ ఏదో ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ వస్తున్న సంగతి తెలిసిందే.మొన్నటికి మొన్న మా ఎన్నికల విషయంలో ఏకగ్రీవం చేయాలని ఇండస్ట్రీ పెద్దల్ని కోరాడు. దీనికి బాలయ్య వంటి హీరోలు మద్దతు పలుకగా.. నాగబాబు వంటి నటులు ఖండించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఇతను `జైలుకి వెళ్లి ఊచ‌లు లెక్క‌పెట్టాల్సిన‌వాళ్లు కూడా నీతులు మాట్లాడుతున్నారు` అంటూ ఓ సెటైర్ విసిరాడు. విష్ణు ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్ చేసాడు? అనే విషయం పై ఇప్పుడు చర్చ మొదలైంది.

అంతేకాదు ‘సినీ పరిశ్రమకి పెద్ద దిక్కు లేకుండా పోయింది` అని కూడా అతను అన్నాడు.అతను ఎవర్ని టార్గెట్ చేసాడు అనేది అతను నేరుగా చెప్పకపోయినా… మెగా ఫ్యామిలీని ఉద్దేశించి అన్నాడా అని కొంతమంది అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ విష్ణు ఓ విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గత కొంత‌కాలంగా సినీ ప‌రిశ్ర‌మకి చిరంజీవి అండగా నిలుస్తున్నారు. గతంలో లేని విధంగా సంక్షేమ కార్య‌క్ర‌మాలు జ‌రిగేలా చేస్తున్నారు. `దాస‌రి తర్వాత చిరంజీవే` ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చాలా మంది చెబుతున్నారు. ఆ రకంగా చూస్తే విష్ణు అలా అనడం కరెక్ట్ కాదు. `ఇండ్ర‌స్ట్రీలో పెద్ద‌వాళ్లు చెప్పిన మాటకి కట్టుబడి ఉంటా…` అని ఈ మధ్యనే చెప్పుకొచ్చిన విష్ణు ఇప్పుడు ఇండస్ట్రీలో `పెద్ద దిక్కు లేకుండా పోయింది` అని అనడం అతనికే తెలియాలి.

దాస‌రి నారాయణ రావు… మోహ‌న్‌బాబు కుటుంబానికీ అత్యంత ఆప్తులు. బ‌హుశా ఆయన స్థానంలోకి చిరు రావడం విష్ణు జీర్ణించుకోలేకపోతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.చిరు ఎవరికి సపోర్ట్ చేస్తే ఆ ప్యానెలే గెలుస్తూ వస్తుంది. గత 6 ఏళ్లలో జరిగిన ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అయితే చిరు మద్దతుతో గెలిచిన వాళ్ళు.. అటు తర్వాత ఆయన పై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘దాసరి రేంజ్లో చిరుకి పొలిటికల్ సపోర్ట్ లేకపోవడం ఓ మైనస్ అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏమైనా విష్ణు కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయనే చెప్పాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus