Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు
- June 23, 2025 / 01:50 PM ISTByPhani Kumar
“నా జీవితంలో ప్రభాస్ (Prabhas) కృష్ణుడు లాంటివాడు. అతను ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ నాన్నగారు(మోహన్ బాబు) (Mohan Babu) పై ఉన్న ప్రేమ,గౌరవంతో చేశాడు. అందుకే అతన్ని నేను సెట్స్ లో ఏడిపిస్తూ ఉండేవాడిని. ‘నువ్వు మీ బావ(మోహన్ బాబు) కోసం చేశావ్. నా కోసం చేస్తున్నావా ఏంటి?’ అని..! అందుకు అతను ‘అంతే మరి.. బావ కోసం చేయాలి కదా’ అనేవాడు. ప్రభాస్ (Prabhas) ని నేను విపరీతంగా ప్రేమించేది అతని మానవత్వం చూసి.
Manchu Vishnu
అతన్ని చూసి ఈ తరం చాలా నేర్చుకోవాలి. కొంత డబ్బు వచ్చినా.. కొంత పేరొచ్చినా మనుషులు మారిపోతూ ఉంటారు. అతను (ప్రభాస్) (Prabhas) ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. అయినా సరే అతను నాతో మొదటి రోజు ఎలా ఉన్నాడో.. ఈరోజుకి అలానే ఉన్నాడు” అంటూ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

అయితే “ప్రభాస్ (Prabhas) ని నేను విపరీతంగా ప్రేమించేది అతని మానవత్వం చూసి. అతన్ని చూసి ఈ తరం చాలా నేర్చుకోవాలి. కొంత డబ్బు వచ్చినా.. కొంత పేరొచ్చినా మనుషులు మారిపోతూ ఉంటారు” అంటూ విష్ణు (Manchu Vishnu) పలికిన ఈ డైలాగులు కచ్చితంగా మంచు మనోజ్ ను ఉద్దేశించి అన్నవే అని.. కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఆస్తుల విషయంలో మనోజ్(Manchu Manoj) – విష్ణు(Manchu Vishnu)..ల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మోహన్ బాబు (Mohan Babu) పెద్ద కొడుక్కి మద్దతుగా నిలబడ్డారు. ‘నా ఆస్తి నా ఇష్టం.. నాకు నచ్చిన వాళ్లకు ఇచ్చుకుంటాను’ అని బహిరంగంగానే చెప్పడం జరిగింది. వాళ్ళ ఆస్తుల పంచాయతీ ఇంకా కొలిక్కి వచ్చినట్లు లేదు అనే విష్ణు పలికిన ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు అని.. కొందరు అంటున్నారు.
చిరంజీవిని శేఖర్ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?
ప్రభాస్.. నా జీవితంలో నువ్వు కృష్ణుడివి.. నీ జీవితంలో నేను కర్ణుడిని#Kannappa #VishnuManchu #Prabhas #Mohanlal #MohanBabu #AkshayKumar #SarathKumar #KajalAggarwal #Brahmanandam pic.twitter.com/WoJ4FdqWyc
— Filmy Focus (@FilmyFocus) June 21, 2025
















