మంచు మోహన్ బాబు తనయుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ ‘మా’ అధ్యక్షుడైతే తనకు ఓకే అని విష్ణు చెప్పుకొచ్చారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పొలిటీషియన్స్ తో తనకు మంచి అనుబంధాలు ఉన్నాయని విష్ణు అన్నారు. టాలీవుడ్ పెద్దలు ఏకగ్రీవంగా ‘మా’ అధ్యక్షుడిని ఎంచుకుంటే తాను ఎన్నికల నుంచి తప్పుకుంటానని విష్ణు చెప్పుకొచ్చారు.
అలా అధ్యక్షుడిని ఎంచుకోకపోతే మాత్రం తాను ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని విష్ణు తెలిపారు. బాలయ్యను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తాను చాలా సంతోషిస్తానని ఆయన సోదరుడి లాంటి వ్యక్తి అని విష్ణు చెప్పుకొచ్చారు. బాలకృష్ణ లేదా ఆయన జనరేషన్ కు చెందిన నటులు అధ్యక్షులు అయితే బాగుంటుందని విష్ణు అభిప్రాయపడ్డారు. అయితే వాళ్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం సమయాన్ని కేటాయించడం అంత సులువుగా జరగదని విష్ణు అన్నారు. నాగబాబు కామెంట్ల గురించి స్పందించిన విష్ణు నాగబాబు అంటే తనకు చాలా ఇష్టమని నాగబాబు తనకు తండ్రిలాంటి వారని చెప్పుకొచ్చారు.
‘మా’ కోసం అవసరమైన భూమిని రాజకీయ నాయకులతో మాట్లాడి సంపాదించుకోగలననే నమ్మకం తనకు ఉందని విష్ణు వెల్లడించారు. ‘మా’ భవన నిర్మాణం విషయంలో తన ప్లానింగ్ గురించి నాగబాబు అడిగారని సమయం వచ్చినప్పుడు తన ప్లానింగ్ చెబుతానని విష్ణు అన్నారు. విష్ణు కామెంట్లు చేసిన నేపథ్యంలో బాలకృష్ణ ‘మా’ అధ్యక్షుడిగా చేయడానికి ఒప్పుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!