ఆర్. ఎక్స్.100 చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండో ప్రయత్నంగా ‘మహాసముద్రం’ అనే క్రేజీ ప్రాజెక్టు చేశాడు. స్కేల్ పరంగా ఇది చాలా పెద్ద ప్రాజెక్టు కూడా..! కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. కథ కొత్తగా ఉన్నా కథనం స్లోగా ఉండటంతో ప్రేక్షకులు ఆ చిత్రాన్ని లైట్ తీసుకున్నారు.’మహాసముద్రం’ ఫలితంతో అజయ్ భూపతికి నిర్మాతలు ఛాన్స్ ఇవ్వలేదు.
ఈ క్రమంలో తాను కూడా నిర్మాతగా మారి ‘మంగళవారం’ అనే థ్రిల్లర్ మూవీ చేశాడు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్ లు రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. మరోపక్క థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. నైజాం వంటి ఏరియా హక్కులను దిల్ రాజు దక్కించుకున్నారు. ఇక నవంబర్ 17 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ఈ చిత్రాన్ని (Mangalavaram) వీక్షించిన సెన్సార్ వారు… చాలా కట్స్ చేయాలని సూచించారట. లేదంటే యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వలేము అని చెప్పారట. దీంతో దర్శకుడు అజయ్ భూపతి.. యు/ఎ రాకపోయినా పర్వాలేదు కట్స్ మాత్రం వద్దు అని రిక్వెస్ట్ చేయడంతో, క్లీన్ ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
పాయల్ రాజ్ పుత్ నటన, ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ అని సెన్సార్ వారు చెప్పారట. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది… బి,సి సెంటర్స్ లో సినిమా బాగా ఆడే అవకాశం ఉంది అని కూడా వారు అభిప్రాయపడినట్లు సమాచారం.