భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఏ లాంగ్వేజ్ నుండి ప్రొడ్యూస్ అయినా.. దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాలు మంచి విజయం అందుకుంటున్నాయి. ఈ వరుసలో ఇప్పుడు తెరకెక్కుతున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా చాలా రోజులు పాటు సాగి, సాగి ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబరు 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో మణిరత్నం చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. రెండు భాగాలు రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగంగా ‘పీఎస్ 1’ (పొన్నియిన్ సెల్వన్ 1) ప్రచారంలో భాగంగా మొత్తం టీమ్ ఇటీవల హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ చేశాయి. ఈ సందర్భంగా మణరిత్నం మాట్లాడుతూ ‘‘ఒక కథని విజయవంతంగా రెండు భాగాలుగా ఎలా చెప్పాలో రాజమౌళి చూపించారు. ‘బాహుబలి’ సిరీస్ సినిమాల వల్లే ‘పొన్నియిన్ సెల్వన్’ సాధ్యమైంది’’ అని అన్నారు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
‘పొన్నియిన్ సెల్వన్ 1’లో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. సినిమాలోని ‘చోళ చోళ..’ విడుదల సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ ‘‘శంకర్, మణిరత్నం సినిమాల్లో నటించాకే రిటైర్ కావాలని ముందే అనుకున్నా. మణిరత్నం సినిమాలో ఇలాంటి ఓ మంచి పాత్రని చేయడం నాకు దక్కిన భాగ్యం’’ అని చెప్పారు.
దీంతో విక్రమ్ మాటలు కూడా వైరల్‌గా మారాయి. విక్రమ్ ఆఖరి సినిమా ‘ప్నొన్నియన్ సెల్వన్ అవుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఎందుకంటే గత కొంతకాలంగా విక్రమ్‌కు సరైన విజయాలు లేవు. ఈ సమయంలో ‘పీఎస్ 1’ వస్తోంది. ఆ తర్వాత ‘పీఎస్ 2’ రిలీజ్ చేస్తారు. ఈ రెండు సినిమాల తర్వాత విక్రమ్ రిటైర్ అయిపోతారా అని అనుకుంటున్నారు. దీనిపై విక్రమ్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.