రామ్ గోపాల్ వర్మ ‘సత్య’ సినిమా రోజుల్లోకి అలా ఓసారి వెళ్తే… అందులో ఓ మంచి నటుడు కనిపిస్తాడు. అంతకుమించి మంచి డ్యాన్సర్ కూడా కనిపిస్తాడు. ఆ నటుడు ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు, మెప్పించాడు, వావ్ అనిపించాడు కూడా. అయితే డ్యాన్స్ మాత్రం చేయలేదు. ఎందుకు, ఏంటి అనే ప్రశ్న ఉన్నా అలాంటి అవకాశం రాలేదేమో అనుకున్నారంతా. అయితే ఆయన డ్యాన్స్ మానేయడానికి ఇంకో హీరో చేసిన డ్యాన్స్‌ను చూడటమే అట. ఆ విషయం ఆయనే చెప్పారు.
‘సత్య’లో బెస్ట్ యాక్టర్ అంటే మీకు ఇప్పటికే ఆ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ అని అర్థమై ఉంటుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తన కెరీర్ గురించి, నటన గురించి, డ్యాన్స్ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో ఆయన కాస్త నవ్వుతూ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. నా కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో డ్యాన్స్ చేసేవాడిని. అయితే, ‘కహో నా ప్యార్ హై’ సినిమాలో హృతిక్ రోషన్ డ్యాన్స్ చూశాక డ్యాన్స్ మానేశాను అని చెప్పారు. దీంతో ఇప్పుడు ఆ మాటలు వైరల్ అవుతున్నాయి.
హృతిక్ డ్యాన్స్‌కు ఫిదా అయ్యాను. ‘డ్యాన్స్ అంటే ఇదీ’ అని అనిపించింది. దీంతో ఆ తర్వాత డ్యాన్స్ చేయడం మనేశాను అని చెప్పారు మనోజ్. ఆ తర్వాత కొన్నాళ్లకు టైగర్ ష్రాఫ్ వచ్చాడు. అతను కూడా అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు అంటూ బాలీవుడ్ బెస్ట్ డ్యానర్ల గురించి చెప్పుకొచ్చారు మనోజ్. నేను నార్మల్ మనిషిని, వాళ్లలా నేను డ్యాన్స్ చేయలేను. అందుకే నా సినిమాల్లో డ్యాన్స్ చేయడం మానేశా అని చెప్పారు.
‘సత్య’ సినిమాలోని భీకూ మాత్రే పాత్ర కోసం ఆ రోజుల్లో నాలుగు నెలలు కష్టపడి తనను తాను సిద్ధం చేసుకున్నాను అని చెప్పారు మనోజ్. ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపుర్’ కోసం అయితే… దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో చాలా రోజులు చర్చించి పాత్రను మలచుకున్నాను అని చెప్పారు. అలా చేశారు కాబట్టే భారతీయ భాషల్లో మనోజ్ (Manoj Bajpayee) ఇప్పుడు స్టార్ యాక్టర్‌గా నిలిచారు.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!