కోలీవుడ్‌లో వరుస విజయాలు వస్తున్నా… విశాల్‌కి మాత్రం సరైన విజయం దక్కడం లేదు. అలాగే దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌కి కూడా. అయితే ఆ ఇద్దరి హిట్ ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ‘మార్క్ ఆంటోని’ వచ్చింది. ఈ సినిమాకు మంచి టాక్ వస్తోందని టీమ్ చెబుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సరైన స్పందన లేదు అంటున్నారు. ఆ విషయం పక్కనపెడితే.. ఈ సినిమా ఇలా తెరకెక్కడం వెనుక ప్రముఖ హీరో ఉన్నారు అని అధిక్ రవిచంద్రన్ చెప్పుకొచ్చారు.
‘మార్క్ ఆంటోని’ సినిమా విడుదల సందర్భంగా చెన్నైలో ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. చిత్రానికి మంచి స్పందన వస్తోందంటూ ఆనందం వ్యక్తం చేసిన అధిక్ రవిచంద్రన్… ఈ సంతోష సమయంలో అజిత్‌ను గుర్తుచేసుకోవాల్సిందే అని చెప్పారు. దీంతో విశాల్ సినిమాకు అజిత్‌కు ఏం సంబంధం అంటూ చర్చ మొదలయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఆ వెంటనే అధిక్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమా కథ గురించి ఆయన దగ్గర ప్రస్తావిస్తే కొన్ని మార్పులు సూచించారట. అవే ఇప్పుడు సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి అని అధిక్ అన్నారు.
సినిమా నేపథ్యాన్ని మార్చమని సలహా ఇచ్చింది అజితే. ‘మార్క్ ఆంటోని’ సినిమాను తీసుకురావడానికి అజిత్ నన్ను బాగా ప్రోత్సహించారు అని అధిక్ రవిచంద్రన్ చెప్పుకొచ్చారు. జీవీ ప్రకాశ్ కుమార్ ‘త్రిష లేదా నయనతార’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు అధిక్. ఆ సినిమా తర్వాత శింబుతో ‘అన్బనవన్ అసరధవన్ అదంగధవన్’, ప్రభుదేవాతో ‘భగీరా’ లాంటి సినిమాలు చేశారు. అయితే అవేవీ సరైన విజయం అందుకోలేదు. ఈ క్రమంలో అధిక్ ‘నేర్కొండ పార్వై’ సినిమాలో నటించారు.
ఆ సమయంలోనే ‘మార్క్ ఆంటోని’ కథను అజిత్ (Ajith) దగ్గర చెప్పారట. ఆ సమయంలో ఆయన చెప్పిన మార్పులు సినిమాలో పెట్టాను అని చెప్పారు అధిక్. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఎస్.జె. సూర్యను తీసుకోమని చెప్పింది కూడా అజితేనట. విశాల్, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉంటుంది.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!