రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ భాను భోగవరపు దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన చిత్రం ‘మాస్ జాతర’. వరుస వాయిదాల తర్వాత ఈ నెల 31న సాయంత్రం విడుదలవుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కి ప్రముఖ కథానాయకుడు సూర్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. అందులో రాజేంద్ర ప్రసాద్ శపథం, రవితేజ గురించి సూర్య పోలిక, నాగవంశీ దుబాయ్ రియాక్షన్, భాను భోగవరవపు డైలాగ్ రిక్రియేషన్, రవితేజ – శ్రీలీల డ్యాన్స్ హైలైట్‌గా నిలిచాయి. అవేంటో చదివేయండి!
* రవితేజ పేరు వినగానే నాకు నవ్వు గుర్తొస్తుంది. సగటు మనిషిని తెరపై కింగ్‌సైజ్ స్థాయిలో ఆవిష్కరించిన నటుడు రవితేజ. ‘విక్రమార్కుడు’ సినిమాకు రీమేక్‌గా తమిళంలో కార్తి చేసిన ‘సిరుత్తై’ భారీ విజయం అందుకుని కెరీర్‌నే మార్చేసింది. అదిరిపోయే కామెడీ టైమింగ్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌లో చూశాం. రవితేజ కూడా అంతే – సూర్య
* కార్తి, నేను ఎక్కువగా కలుస్తుంటాం. సూర్యని చాలా ఏళ్ల తర్వాత కలిశా. ఇకపై కలుస్తూనే ఉంటాం. భాను భోగవరపు మాస్ దర్శకుడే కాదు, ఆయన దగ్గర ఇంకా చాలా డిఫరెంట్ కథలు ఉన్నాయి. అవి కూడా మీరు చూడాలి. శివుడు పాత్ర చేసిన నవీన్ చంద్ర ఇలా కూడా చేస్తాడా అనిపిస్తుంది. – రవితేజ

* రవితేజ ఓ విశ్వవిద్యాలయం. అందులో డిగ్రీ పట్టా పొంది బయటకు వస్తున్న విద్యార్థిని నేను. నిర్మాత సూర్యదేవర నాగవంశీ పిన్ పాయింట్‌గా మాట్లాడారు. ఆయన్ని దాటుకుని సినిమా వచ్చిందంటే హిట్ అని అర్థం – భాను భోగవరపు
* సినిమాపై పూర్తి నమ్మకం ఉంది. రవితేజ నుండి ఆయన అభిమానులు, ప్రేక్షకులకు ఆశించే అన్ని అంశాలు ఉంటాయి. సినిమా సూపర్ బంపర్ అని అంటే మళ్లీ ఏదైనా తేడా జరిగితే సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తారు. అలాగే ఈసారి ఏం జరిగినా దుబాయ్ వెళ్లను – నాగవంశీ

* ఈ సినిమాలో ఏముందో తాను చెప్పను. ఒకవేళ సినిమా చూశాక మీరు షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా – రాజేంద్ర ప్రసాద్
* ఈవెంట్‌లో రవితేజ, శ్రీలీల కలసి సినిమాలోని ‘తుమేరా లవర్…’ పాటకు స్టెప్పులేశారు. అలాగే సినిమాలోని ‘రైల్వేలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్స్ ఉంటాయి. నేను వచ్చాక ఒకటే వార్ జోన్’ అనే డైలాగ్ సూర్య రీ క్రియేట్ చేశారు.
