Ravi Teja: బిగ్ బాస్ కంటెస్టెంట్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రవితేజ.. ఏమైందంటే?

స్టార్ హీరో, మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) వేర్వేరు జానర్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం మిరపకాయ్ (Mirapakay) కాంబినేషన్ రిపీట్ కానుండటం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్ దీప్ కు (Amardeep) రవితేజ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గమనార్హం.

తాజాగా రవితేజను అమర్ దీప్ కలవగా అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. నా కల నిజమైందంటూ అమర్ దీప్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. రవితేజతో కలిసి నటించే అవకాశం వచ్చిందని అమర్ దీప్ చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ కుడా అమర్ దీప్ కు అభినందనలు చెబుతున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రవితేజను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సెలబ్రిటీలలో చాలామంది తమ సినిమాలలో ఛాన్స్ ఇస్తామని కొంతమంది నటులకు హామీ ఇస్తున్నా ఆ హామీలను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. అయితే రవితేజ మాత్రం అలా కాదు. మాస్ మహారాజ్ రవితేజ తన కష్టంతో ఒక్కో మెట్టు పైకి ఎదిగారు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే రవితేజ అమర్ దీప్ కు ఛాన్స్ ఇచ్చారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాతో పాటు సామజవరగమన (Samajavaragamana) ఫేమ్ భాను డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలలో ఏ సినిమాలో అమర్ దీప్ కు ఛాన్స్ దక్కిందో తెలియాల్సి ఉంది. రవితేజ సినిమాలో అమర్ దీప్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో చూడాల్సి ఉంది. మాస్ మహారాజ్ రవితేజ పారితోషికం 25 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని భోగట్టా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus