Mathu Vadalara 2 Review in Telugu: మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
September 13, 2024 / 12:32 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
శ్రీ సింహా కోడూరి (Hero)
ఫరియా అబ్దుల్లా (Heroine)
సత్య, వెన్నెల కిషోర్, సునీల్, రోహిణి (Cast)
రితేష్ రాణా (Director)
చిరంజీవి (చెర్రీ) - హేమలత పెదమల్లు (Producer)
కాల భైరవ (Music)
సురేష్ సారంగం (Cinematography)
Release Date : సెప్టెంబర్ 13, 2024
సరిగ్గా 5 ఏళ్ల క్రితం వచ్చిన “మత్తు వదలరా” (Mathu Vadalara) అనే చిత్రం చిన్నపాటి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా రిలీజ్ అయ్యింది “మత్తు వదలరా 2”. శ్రీసింహ, సత్య ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రానికి రితేష్ రాణా దర్శకుడు. మరి ఫస్ట్ పార్ట్ అలరించిన స్థాయిలో ఈ సీక్వెల్ ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!
కథ: ఫస్ట్ పార్ట్ లో డెలివరీ బాయ్స్ గా చిన్న తప్పు చేయడం కోసం ప్రయత్నించి ఉద్యోగాలు పోగొట్టుకున్న బాబు మోహన్ (శ్రీ సింహ) (Sri Simha) & ఏసు (సత్య) (Satya) లాబీయింగ్ చేసి మరీ HE టీమ్ (హై ఎమర్జెన్సీ)లో జాయిన్ అవుతారు. అక్కడ కిడ్నాప్ కేసులు డీల్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు కానీ.. వచ్చిన సాలరీ సరిపోక చాలా ఇబ్బందిపడుతుంటారు.
ఈ క్రమంలో వారికి బాగా అచ్చొచ్చిన “తస్కరించుట” మొదలెడతారు. ఆ ప్రాసెస్ లోనే అనుకోని విధంగా ఒక రెండు హత్య కేసుల్లో ఇరుక్కుంటారు.
అసలు బాబు మోహన్ & ఏసులను టార్గెట్ చేసింది ఎవరు? వాళ్లను ఎందుకని హత్య కేసుల్లో ఇరికించాలనుకుంటారు? అందులోనుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “మత్తు వదలరా 2” (Mathu Vadalara 2) చిత్రం.
Mathu Vadalara 2 Review
నటీనటుల పనితీరు: సినిమాకి మెయిన్ హీరో శ్రీసింహ (Sri Simha) అయినప్పటికీ.. సినిమాలో మెయిన్ హీరో మాత్రం సత్య. తన కామెడీ టైమింగ్ తో విశేషంగా నవ్వించాడు. సత్య కనిపించే ప్రతి ఫ్రేమ్ లో కామెడీ పండింది. సత్య లేని ఈ సినిమాను కనీసం ఊహించలేం. ముఖ్యంగా.. చిరంజీవిలా డ్యాన్స్ చేసేప్పుడు సత్య ఎనర్జీకి అందరూ సలాం కొట్టాల్సిందే. సెకండాఫ్ లో బాగా నెమ్మదించిన సినిమాకి సత్య డ్యాన్స్ మంచి ఊపునిచ్చింది. సత్యను జూనియర్ బ్రహ్మానందం అనడంలో ఎలాంటి తప్పు లేదు.
సత్య తర్వాత అదే స్థాయిలో అలరించిన మరో నటుడు వెన్నెల కిషోర్. స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ.. ఉన్న కొన్ని సన్నివేశాల్లోనే విపరీతంగా ఎంటర్టైన్ చేశాడు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు రితేష్ రాణా చిరంజీవికి ఎంత పెద్ద ఫ్యాన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. “మత్తు వదలరా 2”(Mathu Vadalara 2) ఓపెనింగ్ & ఎండింగ్ సీక్వెన్స్ లు రెండూ చిరంజీవి షాట్స్ తో నింపి తన అభిమానాన్ని మరోసారి ఘనంగా చాటుకున్నాడు. ముఖ్యంగా సీక్వెల్ ను మొదటి భాగంతో కనెక్ట్ చేసిన విధానం బాగుంది. పైగా.. అజయ్ పాత్రను బిల్డ్ చేసిన విధానం అతడి ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. అయితే.. సెకండాఫ్ లో డ్రామా & సస్పెన్స్ ను సస్టైన్ చేయడం కోసం ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ ను మరీ ఎక్కువగా సాగదీశాడు. ఆ ఎపిసోడ్స్ ను అనవసరంగా సాగదీయకుండా ఉండుంటే సినిమా అస్సల ఇక్కడా బోర్ కొట్టేది కాదు. అయితే.. ఆ సాగతీతను క్లైమాక్స్ తో కవర్ చేశాడనే చెప్పాలి. ఇక.. ఎండ్ క్రెడిట్స్ లో “పార్ట్ 3”కి కూడా మంచి లీడ్ ఇచ్చిన తీరు బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా తన మునుపటి సినిమా “హ్యాపీ బర్త్ డే” తరహాలో మీమ్స్ కు ఎక్కువ ప్రాధ్యాత ఇవ్వకుండా అక్కడక్కడా మాత్రమే కొన్ని మీమ్స్ ను రీక్రియేట్ చేయడం అనేది తన తప్పును రియలైజ్ అయ్యాడు అని చెప్పకనే చెప్పాడు. ఓవరాల్ గా “మత్తు వదలరా 2”తో తన సత్తా చాటుకున్నాడనే చెప్పాలి.
కాలభైరవ నేపథ్య సంగీతం మరోసారి ఆకట్టుకోగా.. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది.
ప్రొడక్షన్ డిజైన్ విషయంలో చాలా చోట్ల రాజీపడినట్లు తెలుస్తుంది. అయితే.. సత్య కామెడీతో ఆది కవర్ అయిపోయింది.
విశ్లేషణ: కామెడీ థ్రిల్లర్స్ లో లాజికల్ ఎక్స్ ప్లనేషన్స్ కి ఎక్కువ స్క్రీన్ టైమ్ ఇవ్వకూడదు. ఇదండీ సంగతి అని వివరించే తీరు చాలా క్రిస్ప్ గా ఉండాలి. మనం “స్కూబీ డు” కార్టూన్ సిరీస్ నుంచి ఈ తరహా కాన్సెప్టులు చూస్తూనే ఉన్నాం. “మత్తు వదలరా 2” కూడా ఇంచుమించుగా అదే ఫార్మాట్ ను ఫాలో అవుతుంది. అయితే.. రాతలో ఉన్న చాలా లోపాలను సత్య కామెడీ కవర్ చేసింది. అయితే.. సెకండాఫ్ స్క్రీన్ ప్లే & ముగింపును ఇంకాస్త నీట్ గా రాసుకొని ఉంటే ఫస్టాఫ్ లో పండిన కామెడీకి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేది. అయితే.. సత్య కామెడీ, కాల భైరవ సంగీతం, రితేష్ రానా టేకింగ్ కోసం ఈ సినిమాను ఈ వీకెండ్ కి కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే!
ఫోకస్ పాయింట్: గమ్మత్తు గారడీ కంటే పేరడీ కామెడీ వర్కవుటయ్యింది!