Matka: ‘మట్కా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!
- November 14, 2024 / 01:46 PM ISTByFilmy Focus
వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో ‘మట్కా’ (Matka) అనే సినిమా రూపొందింది. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నోరా ఫతేహి (Nora Fatehi) కీలక పాత్ర పోషించింది. ‘మట్కా’ టీజర్, ట్రైలర్లకి.. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరిగింది. కొన్ని చోట్ల రెంట్ల పద్దతిలో, ఇంకొన్ని చోట్ల షేరింగ్ పద్ధతిలో ‘మట్కా’ హక్కులని విక్రయించారు.
Matka

అయితే వరుణ్ గత చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) కంటే దీనికి తక్కువే బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
| నైజాం | 4.50 cr |
| సీడెడ్ | 2.00 cr |
| ఉత్తరాంధ్ర | 2.00 cr |
| ఈస్ట్ | 0.60 cr |
| వెస్ట్ | 0.50 cr |
| గుంటూరు | 1.00 cr |
| కృష్ణా | 1.20 cr |
| నెల్లూరు | 0.50 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 12.30 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.00 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 14.30 cr |
‘మట్కా’ చిత్రానికి రూ.14.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే.. లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు అంటే కష్టమే..!
















