ఈ రోజుల్లో ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడం అనేది చాలా ఛాలెంజింగ్ గా మారింది. సరైన విధంగా సినిమాని కనుక ప్రమోట్ చేసుకోకపోతే.. పలానా డేట్ కి సినిమా వస్తుంది అని గుర్తు చేయకపోతే అది ఆడియన్స్ కి రీచ్ అవ్వడం చాలా కష్టం. కోవిడ్ తర్వాత వారానికి ఎంత కాదనుకున్నా 3,4 సినిమాలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ అయ్యేది 5 వ రోజు అయిన శుక్రవారం పూట. శుక్రవారం తీసేసి.. సోమవారం నుండి చూసుకుంటే 4 రోజులే మిగుల్తాయి. అలాంటప్పుడు ఒక్క సినిమానే ప్రమోషన్ తో ఎలా హైలెట్ అవుతుంది.
అది అసాధ్యం. అందుకే దర్శక నిర్మాతలు కొత్త ఐడియాల కోసం ఎప్పటికప్పుడు టీంలను మారుస్తూనే ఉంటాయి. వాటి వల్ల ఉపయోగం తక్కువే. అయితే ఇప్పుడున్న స్టార్ దర్శకుల్లో తమ సినిమాను సరైన విధంగా ప్రమోట్ చేసేది ఎవరు అంటే టక్కున అనిల్ రావిపూడి (Anil Ravipudi) పేరే ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) కూడా ఆ లిస్ట్ లో చేరినట్టు స్పష్టమవుతుంది. త్రినాథ్ రావ్ నక్కిన తన గత చిత్రం ‘ధమాకా’ కి (Dhamaka) కూడా అలాగే ప్రమోట్ చేశాడు.
అది మంచి హిట్ అయ్యింది. సినిమాలో కంటెంట్ సో సోగా ఉన్నా, సినిమా నిలబడింది అంటే.. ముందు నుండీ త్రినాధ్ రావ్ చేసిన ప్రమోషన్ వల్లనే అని చెప్పాలి. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ ‘మజాకా’ (Mazaka) ని కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాడు త్రినాథ్ రావ్ నక్కిన. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది. అంటే మరో వారం రోజుల్లోనే రిలీజ్ అనమాట. అయినా ఒక పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ విషయాన్ని చెబితే రకరకాల ఊహాగానాలు, అభిప్రాయాలూ వినిపిస్తాయి.
కానీ దానినే పబ్లిసిటీకి వాడేసుకున్నాడు త్రినాధ్ రావ్. ‘మా సినిమాలో ‘రావులమ్మ’ అనే ఒక సాంగ్ షూటింగ్ చేయాల్సి ఉంది. కాబట్టి.. మీడియా వారు తమ ఫ్యామిలీస్ తో ఆ సాంగ్ షూటింగ్ కి వచ్చేయండి. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి’ అంటూ పిలుపునిచ్చారు. చాలా మంది సెట్స్ కి వెళ్లారు. ఆ సాంగ్ కి సంబంధించి విజువల్స్ ను షూట్ చేసి మరీ సోషల్ మీడియాలో పెట్టారు. ఈరోజు ‘మజాకా’ (Mazaka) కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి కారణం ఇదే.
రిలీజ్ కి ముందు సాంగ్ ఇలా తెలిసిపోతే ఎలా? అని కొందరు అనుకోవచ్చు. బాలీవుడ్లో అయితే వీడియో సాంగ్స్ ని రిలీజ్ కి ముందు రిలీజ్ చేస్తారు కదా..! అందులో ఇబ్బంది లేనప్పుడు ఇందులో ఏముంది. ‘మజాకా’ సినిమా గురించి చాలా మంది ఈరోజు మాట్లాడుకుంటున్నారు అంటే కారణం ఈ సాంగ్ షూటింగ్ అనే చెప్పాలి. మిడ్ రేంజ్ సినిమాలకి ఈ ట్రెండ్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి
LIVE: #Majaka Movie Song Shooting Live |#SundeepKishan #ThrinadhaRaoNakkina https://t.co/IqJrWm6lTE
— Filmy Focus (@FilmyFocus) February 17, 2025