టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు నాలుగే అయినా ఆ సినిమాలన్నీ సక్సెస్ సాధించడం గమనార్హం. అయితే నిన్న విడుదలైన ఆచార్య ట్రైలర్ మాత్రం ఈ సినిమాకు కొరటాల శివ నిజంగా దర్శకత్వం వహించారా? అని ప్రేక్షకులలో సందేహం వ్యక్తం కావడానికి కారణమైంది. ఆచార్య ట్రైలర్ లో పెద్దగా ప్రత్యేకలు ఏమీ లేదు.
ఈ సినిమా రొటీన్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా అని ప్రేక్షకుల్లో సందేహాలు వ్యక్తం కావడానికి ట్రైలర్ ఒక విధంగా కారణమైంది. ఆచార్య నుంచి ఎమోషన్స్ తో కూడిన మరో ట్రైలర్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతున్నా ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. కొరటాల శివ మార్క్ ట్రైలర్ లో మిస్సైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ట్రైలర్ లో చరణ్ చిరంజీవిని డామినేట్ చేశారని చిరంజీవి డల్ గా కనిపించారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
వైరల్ అవుతున్న నెగిటివ్ కామెంట్ల గురించి కొరటాల శివ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కరోనా వల్ల ఈ సినిమా ఏకంగా ఏడాది ఆలస్యంగా థియేటర్లలో విడుదలవుతోంది. మెగా మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఆచార్య సినిమా పలు నెగిటివ్ సెంటిమెంట్లను సైతం బ్రేక్ చేయాల్సి ఉంది. ఆచార్య సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.
రాధేశ్యామ్, బీస్ట్ సినిమాలతో పూజా హెగ్డేకు భారీ షాకులు తగిలాయి. ఆచార్య సినిమాతో నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాల్సిన బాధ్యత పూజా హెగ్డేపై ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే నీలాంబరి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.