ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్లలో ఆచార్య సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయినా కొరటాల శివ సినిమాతో మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ భావించారు. ఆచార్య సినిమాను చూసిన ప్రేక్షకులు కొరటాల ఈ సినిమాను ఇలా తీశారేంటి అని కామెంట్లు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సినిమాలో ఎలివేషన్ సీన్లు లేవని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో ఎమోషన్స్ అనుకున్న స్థాయిలో పండలేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొరటాల శివ సినిమాలలో వీక్ సినిమా ఇదేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్ బాగానే ఉన్నా క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. చిరంజీవి, చరణ్ స్క్రీన్ పై అద్భుతంగా ఉన్నా వాళ్లిద్దరినీ మరింత అద్భుతంగా చూపించే అవకాశాన్ని కొరటాల శివ మిస్ చేసుకున్నారని చెప్పాలి. కొరటాల శివ మాస్ సినిమాకు క్లాస్ టచ్ ఇచ్చే ప్రయత్నం సినిమాకు మైనస్ అయింది. ఆచార్య నిడివి తక్కువైనా ప్రేక్షకులకు ఈ సినిమా బోరింగ్ గా అనిపించింది.
మణిశర్మ బీజీఎం విషయంలో సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కథ, కథనం అద్భుతంగా లేకుండానే కొరటాల శివ ఆచార్యను తెరకెక్కించి ప్రేక్షకులకు రొటీన్ సినిమాను చూశామనే భావనను కలిగించి తప్పు చేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి, చరణ్ సినిమాలో బాగా చేసినా చిరంజీవి, చరణ్ రేంజ్ కు తగిన సన్నివేశాలు అయితే లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలో కొరటాల శివ మార్క్ అయితే మిస్సైందని ప్రేక్షకులు భావిస్తున్నారు. సినిమాలో ప్లస్ పాయింట్లు ఎక్కువగా లేవని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఆచార్య చిరంజీవి, చరణ్ స్థాయి సినిమా అయితే కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆచార్య అంచనాలను మాత్రం రీచ్ కాలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయి హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. ఆచార్య మెగా అభిమానులను సైతం తీవ్రస్థాయిలో నిరాశపరిచిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.