ఇది సోషల్ మీడియా యుగం. ప్రపంచంలోని అందరు నెటిజెన్స్ అభిప్రాయాలను, ఆలోచనలను, భావాలను పంచుకునే వేదికగా సోషల్ మీడియా ఉంది. పాలించే ప్రభువు నుండి సామాన్య పౌరుడి వరకు సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారు. ఇక ఎప్పుడు పబ్లిక్ అటెంషన్ కోరుకొనే స్టార్ కు ఈ సోషల్ మీడియా చాల అవసరం. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్స్ మరియు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పేస్ బుక్ లలో తమ భావాలను, వ్యక్తిగత విషయాలను తమ సినిమాల అప్డేట్స్ పంచుకుంటారు.
ఇక ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కొంచెం లేటుగా మేల్కొన్నారు. నిన్న ఆయన సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నట్లు గ్రాండ్ గా ప్రకటించారు. ఓ వీడియో సందేశం ద్వారా ఇకపై సోషల్ మీడియాలో తన భావాలు, ఆలోచనలు ఫ్యాన్స్ తో పంచుకకోనున్నట్లు తెలియజేయడం జరిగింది. కాగా నేడు ఉదయం 11:11 నిమిషాలకు చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ నుండి ఓ ట్వీట్ రానుంది.
కాగా ఈ ట్వీట్ సైతం తాను ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య సినిమాకు సంబంధించి అయివుంటుందని సమాచారం. చిరు కొరటాల దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య మూవీ టైటిల్ లోగో లేదా ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం కలదు. లేటుగా అయినా లేటెస్ట్ గా ఎంటర్ అయిన చిరు తన మొదటి ట్వీట్ లో ఫ్యాన్స్ కి ఎలాంటి అనుభూతి ఇస్తారో చూడాలి.