మెగాస్టార్ కి సినిమా చూపించిన జక్కన్న!

మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో.. కానీ తన కొడుకు రామ్ చరణ్ సినిమాల విషయంలో మాత్రం అప్డేట్ లో ఉంటారు. రాజమౌళి లాంటి పెర్ఫెక్ట్ డైరెక్టర్ రూపొందిస్తున్న సినిమా అయినప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఓ కన్నేసి ఉంచుతారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది. దసరా కానుకగా సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా చిరంజీవి ఈ సినిమా చూసేసినట్లు సమాచారం.

ఈ సినిమాలోని కొన్ని కీలకమైన భాగాలను చిరంజీవి.. ఇతర టీమ్ మెంబర్స్ తో కలిసి ఈ మధ్యనే చూశారట. ర‌షెష్ చూసి చిరు చాలా పొంగిపోయాడని.. రాజమౌళిని పొగడ్తలతో ముంచేశారని తెలుస్తోంది. బాహుబలిని మించి ఈ సినిమా ఉందంటూ చిరంజీవి తన సన్నిహితులతో చెబుతున్నారట. నిజానికి మెగాస్టార్ చూసింది కేవలం ర‌షెష్ మాత్రమే.. ఫైనల్ మిక్సింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా చిరు చూశారు. ఇక ఆర్ఆర్ తో చూస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

సాధారణంగా తన సినిమా పూర్తి కాకుండా.. ఇలా ర‌షెష్ వేసి చూపించడం రాజమౌళికి నచ్చదు. టీమ్ మెంబర్స్ కాకుండా బయట వాళ్లకు సినిమా చూపించరు. కానీ చిరంజీవి విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘మగధీర’ సినిమా సమయంలో కూడా చిరు ర‌షెష్ చూసి సినిమా రికార్డులు సృష్టిస్తుందని చెప్పారు. చిరు చెప్పినట్లుగానే జరిగింది. మరి ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus