సినిమా ప్రపంచంలోకి ఎలాంటి అండ లేకుండా వచ్చిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి స్వయంకృషి మెగాస్టార్ గా ఎదిగాడు. మనవూరి పాండవులు సినిమాతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి నేటికి 150చిత్రాలకు పైగా నటించారు. కొనేళ్లుపాటు సినిమాలకు దూరంగా ఉండి రాయకీయాల్లోకి వెళ్లారు. అక్కడ అశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడం వల్ల తిరిగి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. భైదినెంబర్ 150, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలతో తిరిగి అదే జోరు కొనసాగించారు. ప్రస్తుతం భోళా శంకర్ సినిమా చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు ఇరుక్కొని (Chiranjeevi) చిరంజీవి చాలా క్లీన్ అండ్ నీట్ సినీ కెరియర్ ని మెయింటైన్ చేస్తే వస్తున్నారు. అయితే ఒకరు ఎదుగుతున్నారంటే వారి మీద బురద చల్లడం సమాజంలో కామన్.అలాగే చిరంజీవి ఎదుగుతున్న టైంలో కూడా చాలామంది ఆయనపై రూమర్స్ క్రియేట్ చేశారట. కానీ వాటిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా చిరంజీవి వదిలేసేవారట. చిరంజీవి మీద ఎన్నోసార్లు హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వినిపించాయి.కానీ వాటిని అస్సలు పట్టించుకోలేదు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఆపద్భాంధవుడు చిత్రం 1992లో విడుదలై మంచి విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాతో పాపులర్ అయ్యింది మీనాక్షి శేషాద్రి. ఈ చిత్రం కంటే ముందే తెలుగులో బ్రహ్మర్షి విశ్వామిత్రలో నటించింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆపద్భాందవుడు చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత తెలుగులో మరే సినిమా చేయలేదు.
అవకాశాలు రాలేదా? లేక తాను నో చెప్పిందో తెలియదు గానీ ఈ రెండు చిత్రాల్లోనే నటించింది. అయితే ఆపద్భాందవుడులో మీనాక్షిని చూసి చిరంజీవి మొదటి చూపులోనే ఆమెపై మంచి ఇష్టాన్ని పెంచుకున్నారట.అయితే అది మీరు అనుకుంటున్నట్లుగా కాదు. ఆయన గౌరవంతో కూడిన ఇష్టాన్ని పెంచుకున్నారట. మీనాక్షి శేషాద్రి నటనకి చిరంజీవి ఫిదా అయ్యారట. ఇక ఆమెపై ఉన్న అభిమానంతో ఎప్పుడు కూడా హీరోయిన్లకు ఎలాంటి గిఫ్టులు ఇవ్వని చిరంజీవి మొదటిసారి ఆమె కోసం ఒక భారీ గిఫ్ట్ ఇచ్చాడట.