వైరల్ అవుతున్న ‘తొలి తొలి తలకరి చినుకల్లే’ సాంగ్..!

‘హుషారు’ సినిమాలోని ‘ఉండిపోరాదే’ పాట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ పాటకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల వచ్చిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కూడా ఓ సందర్భంలో ఈ పాటని వాడారు అంటే.. ఈ పాట ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రధన్ కూడా అందరికీ సుపరిచితమే. ‘అందాల రాక్షసి’ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీ.. అలాగే ‘అర్జున్ రెడ్డి’ వంటి గేమ్ చేంజర్ చిత్రానికి సంగీతం అందించినది ఈయనే. తాజాగా ఈయన మరో పాటతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

‘అమరం అఖిలం ప్రేమ’ అనే చిత్రానికి ఈయన సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం నుండీ ‘తొలి తొలి తలకరి చినుకల్లే’ అనే లిరికల్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. రెహ్మాన్ లిరిక్స్ అందించిన ఈ పాటని… అనురాగ్ కులకర్ణి ఎంతో జోష్ తో పాడాడు. ఈ పాట కూడా ఎంతో వినసొంపుగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట తెగ వైరల్ అవుతుంది. కచ్చితంగా ‘ఉండిపోరాదే’ స్థాయిలో ఈ పాట మరో చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం అనేలా కనిపిస్తుంది. ఇక ‘అమరం అఖిలం ప్రేమ’ చిత్రంలో విజయ్ రామ్, శివశక్తిన్ జంటగా నటిస్తున్నారు. జోనాథన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వి ప్రసాద్ నిర్మిస్తున్నాడు.


డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus