Meter Trailer Review: ఇది కిరణ్ అబ్బవరం మాస్ ‘మీటర్’.!

‘వాడు బాల్ లాంటోడు.. ఎన్నిసార్లు కొట్టినా పైకి లేస్తూనే ఉంటాడు’ అంటూ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ గురించి ఎలివేట్ చేస్తూ విలన్ చెప్పడం చూస్తుంటే.. ఈసారి కమర్షియల్ హిట్ కొట్టబోతున్నాడనిపిస్తుంది.. కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ కథలు, పాత్రలు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్.. కెరీర్‌లో ఫస్ట్ టైం ‘మీటర్’ అనే భారీ కమర్షియల్ అండ్ మాస్ ఫిలిం చేస్తున్నాడు.. న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ.. వైవిధ్యభరితమైన సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో.

టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో కలిసి స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నాయి.. రమేష్ కడూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీగా ‘మీటర్’ తీశారు.. అతుల్య రవి తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. బుధవారం ‘మీటర్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు..

ట్రైలర్ చూసిన వారంతా ‘ మీటర్ (Meter) మినిమం గ్యారంటీ ఎంటర్‌టైనర్.. ట్రైలర్‌లో హిట్ కళ కనిపిస్తుంది’ అంటూ పాజిటివ్ టాక్ చెప్తున్నారు.. కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్’ లో కానిస్టేబుల్‌గా కనిపించాడు కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. పోలీస్ పాత్రలో హిట్ కొట్టాలనే ఆశ ఈ సినిమాతో తీరబోతుందనేలా ఉంది ట్రైలర్.. ‘గంప దాటిన కోడిపిల్ల, గడప దాటిన ఆడపిల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.. అది దొరికితే బిర్యానీ అవుతుంది, నువ్వు దొరికితే బత్తాయి అవుతావ్..

అడవిని కాపాడే సింహాన్ని మన తలల మీద పెట్టి, ఈ సొసైటీని కాపాడమని దేవుడు మనకిచ్చిన బాధ్యత ఇది.. ఏ తండ్రైనా తను ఓడిపోయినా బాధ పడడేమో కానీ తన కొడుకు ఓడిపోతే మాత్రం భరించలేడు’ అంటూ రైటర్ సూర్య రాసిన డైలాగ్స్ డైనమెట్స్‌లా పేలాయి.. వెంకట్ సి దిలీప్ విజువల్స్, సాయి కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అయ్యాయి.. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7 నుండి థియేటర్లలో మాస్ ‘మీటర్’ తిరగబోతుంది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus