విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ.. మొదటి చిత్రం ‘దొరసాని’ తో పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ.. ఆ చిత్రంతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే తరువాత వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రంతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కరోనా కారణంగా గతేడాది ఎండింగ్లో ‘అమెజాన్ ప్రైమ్’ ఓటిటిలో విడుదలైంది ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. వినోద్ అనంతోజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. హీరో ఫాథర్ క్యారెక్టర్ ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
ఆ పాత్రను పోషించిన గోకరాజు రమణ ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ఈ మధ్యనే జి తెలుగులో టెలికాస్ట్ చేశారు.కాగా మొదటి సారి టెలికాస్ట్ చేసినప్పుడు ఈ చిత్రం 5.71 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదలయ్యి చాలా రోజులు కావస్తున్నప్పటికీ.. అందరి ఫోన్లలో అందుబాటులో ఉన్నప్పటికీ ఈ రేంజ్ టి.ఆర్.పి ని నమోదు చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.
ఇక ఈ చిత్రాన్ని జి తెలుగు వారు 1.5కోట్లు పెట్టి కొనుగోలు చేశారట. వారు పెట్టింది మొత్తం మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడే రికవరీ అయినట్టు తెలుస్తుంది. 4.5కోట్లకు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వారు కూడా సేఫ్ అయిపోయారట. దాంతో రెండో చిత్రంతో మంచి హిట్ ను సాధించాడు ఆనంద్ దేవరకొండ.
Most Recommended Video
చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!