Mike Tyson: సహనం కోల్పోయి ఫ్యాన్ పై చెయ్యి చేసుకున్న నటుడు.. వీడియో వైరల్..!
- April 23, 2022 / 10:44 AM ISTByFilmy Focus
సెలబ్రిటీల వెనుకాల సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు అంటూ అభిమానులు ఎగబడడం సాధారణ విషయమే. అయితే ఒక్కోసారి అభిమానులు హద్దులు మీరు చేసే పనులు సెలబ్రిటీలను విసిగిస్తాయి. దాంతో వాళ్ళు అరవడం, తోసేయడం వంటివి చేస్తారు. ఇప్పుడైతే అంతకు మించి జరిగింది. వివరాల్లోకి వెళితే… అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుండీ ఫ్లోరిడా వెళ్ళే విమానంలో మైక్‌టైసన్ ప్రయాణిస్తున్నాడు. ఆయన వెనుక సీట్లో కూర్చున్న ఓ కుర్రాడు టైసన్‌ను చూసి తెగ ఎగ్జయిట్ అయిపోయి టైసన్ తో ముచ్చటించాలని ట్రై చేసాడు.

టైసన్ మొదట ఓ నవ్వు నవ్వుకుని సైలెంట్ అయిపోయాడు.మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగకూడదు అనేది టైసన్ అభిప్రాయం కావచ్చు. కానీ ఆ యువకుడు నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉండటంతో టైసన్ మండిపడ్డాడు. దయచేసి సైలెంట్ గా ఉండాలంటూ కోరాడు. అయినా కూడా ఆ కుర్రాడు తగ్గలేదు టైసన్ ను మళ్ళీ విసిగించాడు. దీంతో టైసన్ కు కోపం రావడంతో ఆ కుర్రాడి పై నాన్ స్టాప్ పంచులతో దాడి చేసాడు. ఇంకేముంది ఆ కుర్రాడి మొహానికి గాయాలయ్యాయి.

దీనికి సంబంధించిన ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక టైసన్ కూడా నటుడిగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘లైగర్’ చిత్రంతో అతను సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ మూవీని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. ఛార్మి, పూరి కరణ్ జోహార్ లు కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘లైగర్’ ఆగస్టు 25న విడుదల కాబోతుంది.
‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
Imagine being dumb enough to provoke Mike Tyson in the close proximity of a plane during a 3 hour flight😂😭🤦🏽♂️ pic.twitter.com/T3IBuB7lor
— 🛸🐐Ziggy B🐐🛸 (@therealziggyb23) April 21, 2022
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!












