మైక్ టైసన్.. ప్రపంచాన్ని తన కిక్‌లు, పంచ్‌లతో గడగడలాడించిన బాక్సర్. ఎందరితో ఒట్టి చేత్తో మట్టికరిపించాడు. అలాంటి మైక్ టైసన్‌ను సినిమాలోకి తీసుకొని అతనితో ఫైట్ చేయించరు అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం ‘లైగర్’ సినిమాలో మైక్ టైసన్‌కి ఫైట్ ఏమీ లేదట. ఏంటీ.. బ్రహ్మానందాన్ని పెట్టుకుని కామెడీ చేయింము అన్నట్లుగా ఉంది కదా. మాకూ ఇదే అనిపించింది. కానీ ఫైట్ లేని టైసన్ గురించి చెప్పింది ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన వ్యక్తే కాబట్టి నమ్మాల్సి వచ్చింది.
‘లైగర్’ సినిమాలో విజయ్ దేవరకొండ మెయిన్ హైలైట్ అయితే.. సెకండ్ హైలైట్ రమ్యకృష్ణ పాత్ర అని అంటున్నారు. మైక్ టైసన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, అతన్ని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసి ఆఖరికి సాధించామని చెబుతున్నారు. ఇంత చేసి అతనిని బాక్సింగ్ రింగ్‌లోకి తీసుకురావడం లేదు అని అంటున్నారు. అయినప్పటికీ పాత్ర అదిరిపోతుంది అని చిత్రబృందం చెబుతోంది. సినిమాలో కీలక పాత్రలో నటించిన విషు రెడ్డి.. మొన్నీమధ్య మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించాడు.
మైక్ టైసన్ పాత్రను పూరి జగన్నాథ్ పక్కా కమర్షియల్‌గా డిజైన్ చేశారట. ‘లైగర్’లో ఒక లెజెండ్ ఫైటర్ పాత్ర అవసరం ఏర్పడింది. లెజెండ్ అంటే మనకి మైక్ టైసన్ గుర్తుకొస్తారు.. అందుకే ఆయననే ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. మైక్ టైసన్ పాత్రకు ఫైట్లు ఉంటాయి కానీ.. అవి బాక్సింగ్ రింగ్‌లో కాదు అని చెప్పాడు విషు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన పేరు మైక్ టైసన్ కాదట. ఈ విషయంలో ఓ సర్‌ప్రైజ్ ఉంది అని చెప్పాడు. అదేంటో సినిమాలో చూడండి అని అంటున్నాడు.
విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటించిన ఈ సినిమాను కరణ్ జోహర్‌తో కలసి పూరి జగన్నాథ్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేస్తున్నారు. ఆ రోజు ఇండియా మొత్తం షేక్ అవుతుందని ఇప్పటికే విజయ్ దేవరకొండ మాటిచ్చాడు. మరేం చేస్తారో చూడాలి. ఇంకో పది రోజులే ఉన్నాయి.