Adipurush: పాజిటివ్ టాక్ వస్తే ఆదిపురుష్ ఖాతాలో కొత్త రికార్డులు ఖాయమా?

ప్రభాస్ రాముని పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజైన సమయంలో వచ్చిన నెగిటివ్ కామెంట్లు అన్నీఇన్నీ కావు. ఒక దశలో ప్రభాస్ అభిమానులు సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై మాత్రమే తాము ఆశలు పెట్టుకున్నామని ఆదిపురుష్ పై పెద్దగా ఆశలు లేవని అభిప్రాయపడ్డారు. ఆదిపురుష్ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు రావడం కూడా కష్టమని కామెంట్లు వినిపించాయి.. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడంతో ఆ రేంజ్ లో బిజినెస్ చేయడం అసాధ్యమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఆదిపురుష్ మూవీ ట్రైలర్ అభిమానుల్లో ఉన్న అన్ని అనుమానాలను పటాపంచలు చేసింది. జై శ్రీరామ్ సాంగ్ తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఆదిపురుష్ తెలుగు వెర్షన్ హక్కులు ఏకంగా జీఎస్టీతో కలిపి 185 కోట్ల రూపాయలకు పీపుల్స్ మీడియా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ సంస్థకు ఆంధ్ర నుంచి 65 కోట్ల రూపాయల రేంజ్ లో ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఆఫర్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని సమాచారం.

ఆదిపురుష్ తెలుగు హక్కులు సులువుగా 200 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే ఛాన్స్ ఉంది. ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ నమ్మకమే నిజం కానుందని ఈ సినిమా సంచలనాలను సృష్టించనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని సమాచారం. రిలీజ్ సమయానికి ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలు పెరగనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆదిపురుష్ (Adipurush) కచ్చితంగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని అభిమానులు భావిస్తుండగా ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో లేదో చూడాలి. ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus