‘డార్లింగ్’ (Darling) ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr. Perfect) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి ఫామ్లోకి వచ్చిన ప్రభాస్ కి (Prabhas).. ఆ తర్వాత దర్శకుడు లారెన్స్ ‘రెబల్’ తో (Rebel) పెద్ద షాకిచ్చాడు. వాస్తవానికి ‘రెబల్’ ‘మిర్చి’ షూటింగ్లు ఒకే టైంలో మొదలయ్యాయి. కానీ అందరికీ ‘రెబల్’ పైనే హోప్స్ ఉండేవి. కానీ తర్వాత లెక్కలు మారిపోయాయి. ‘మిర్చి’ రిలీజ్ కి ముందు కూడా ఆ సినిమాపై పెద్దగా హోప్స్ లేవు. పైగా అన్ సీజన్లో రిలీజ్ అవుతుంది. అప్పటికి ‘నాయక్’ (Naayak) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాలు కూడా బాగానే ఆడుతున్నాయి.
2013 ఫిబ్రవరి 8న ‘మిర్చి’ రిలీజ్ అయ్యింది. ఎటువంటి బెనిఫిట్ షోలు పడలేదు. కానీ మార్నింగ్ షోల తర్వాత టాక్ అదిరిపోయింది. ‘ఇది కదా ప్రభాస్ నుండి కోరుకున్నది’ అంటూ సినిమాని ఎగబడి చూశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఒకసారి ‘మిర్చి’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 15.11 cr |
సీడెడ్ | 7.51 cr |
ఉత్తరాంధ్ర | 4.20 cr |
ఈస్ట్ | 2.90 cr |
వెస్ట్ | 2.65 cr |
గుంటూరు | 3.71 cr |
కృష్ణా | 2.75 cr |
నెల్లూరు | 1.67 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 25.39 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.30 Cr |
మలయాళం+తమిళ్ | 0.18 Cr |
ఓవర్సీస్ | 2.90 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 47.88 cr |
‘మిర్చి’ చిత్రం రూ.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.47.88 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకి ఈ చిత్రం రూ.17.88 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు పూర్తికావస్తోంది.