నూటికి నూరు శాతం తప్పులు లేకుండా సినిమాలు తీయడం చాలా కష్టం. ఈ మాటను పెద్ద పెద్ద దర్శకులే చెబుతుంటారు. అది కొత్త దర్శకుడు తీసినా, పాత దర్శకుడు తీసినా… తెలుగు దర్శకుడు తీసినా, హిందీ దర్శకుడు తీసినా… తప్పులు అయితే వస్తాయి. అలా రీసెంట్‌గా విడుదలైన ‘పుష్ప’ సినిమాలో కూడా కొన్ని తప్పులున్నాయి. అయితే అవి సినిమాను పెద్దగా ఇబ్బంది పెట్టవు. అయితే సినిమా డైరక్షన్ టీమ్ కంటిన్యుటినీ సరిగ్గా చూసుకోకపోవడం వల్ల జరిగింది అని అర్థమవుతుంది. అలా ఆ సినిమాలో సుమారు 20 తప్పులు ఉన్నాయి. వాటిలో సరదాగా ఓసారి చూద్దాం!
* సినిమా మొదలైంది మనకు జపాన్‌లోని ఓ సంగీత వాద్య పరికరం చూపించి. దానిని ఎర్రచందనంతో చేస్తారని… అది చాలా గొప్పదని. అయితే ఈ క్రమంలో ఆ వస్తువు ధర ₹8 లక్షలు అని చెబుతారు. అయితే ఆ వస్తువు మీద జపాన్ కరెన్సీలో 12,500 అని ఉంటుంది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 8వేలే.
* సినిమా స్టార్టింగ్‌లో శేషాచలం అడవి అంటూ… ఏరియల్ వ్యూలో చూపిస్తారు. అందులో ఓ లారీ వెనుక రెండు బైక్స్ ఉన్నట్లు చూపిస్తారు. ఆ తర్వాతి షాట్‌లోనే మూడు బైక్స్ వస్తాయి. అయితే ఆ తర్వాత వచ్చే సీన్స్‌లో ఆ మూడో బైక్ మళ్లీ ఎక్కడా కనిపించదు.
* సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రన్స్‌లో అతని లారీ ముందు ఓ బైక్ కనిపిస్తుంది. ఆ తర్వాతి షాట్‌లో బైక్ ఉండదు. అలాగే లారీ యాంగిల్ కూడా మారిపోతుంది.
* ఫైట్ స్టార్ట్ అయినప్పుడు చుట్టూరా వాతావరణం వేకువజామున ఉన్నట్లు ఉంటుంది. లారీ లైట్స్ ఆన్ అయ్యి ఉంటాయి. హీరోను ఫోకస్ చేయగానే లారీ లైట్స్ ఆగిపోతాయి. హీరో ఉదయం వెలుతురులో ఉంటాడు. ఫైట్ అయిపోగానే తిరిగి మళ్లీ వేకువజామున లైటింగ్ వచ్చేస్తుంది.
* ఎర్రచందనం కొట్టడానికి అడవిలోకి దిగినప్పుడు వాతావరణం మొత్తం వెలుతురు, ఎండతో నిండిపోయి ఉంటుంది. అయితే హీరో బస్సు దిగగానే వర్షం స్టార్ట్ అవుతుంది. ఒక సెకను గ్యాప్‌లో ఇదెలా సాధ్యం.
* గోవిందప్పకు ఎర్రచందనం దుంగలు దొరక్కుండా చేయడానికి పుష్ప దుంగల్ని చెట్టుకు వేలాడదీస్తాడు. ఈ క్రమంలో ఓ షాట్‌లో నోటిలో వేరుతాడు ఉంటుంది. ఆ నెక్స్ట్ షాట్‌లో ఉండదు.
* గోవిందప్ప నుండి తప్పించుకోవడానికి లారీని బావిలో పడేలా చేస్తాడు పుష్ప. అయితే అంత పెద్ద లారీ నీటిలో అంత వేగంగా మునిగిపోతుందా, రెండోది శబ్దం రాదా అనేది ఓ డౌట్.
* గోవిందప్ప నుండి తప్పించుకోవడానికి ఎర్రచందనం సరకును చెట్టుకు వేలాడదీస్తాడు. అయితే దాని కోసం పోలీసులు కొండ కింద నుండి పైకి వచ్చి చూస్తుంటారు. కింద నుండి వచ్చేటప్పుడు పైన వేలాడదీసిన దుంగలు కనిపిస్తాయి. కానీ పోలీసులు ఎందుకు చూడలేకపోయారో?
* ఎర్రచందనం చెట్లకు వేలాడదీసే సీన్ ఎండింగ్‌లో ఎవరి ముఖం మీదా రంగు ఉండదు. కానీ పాట మొదలవ్వగానే ఒక్కొక్కరి ముఖానికి రంగులు అద్దేసి ఉంటాయి.
* చిన్నప్పటి పుష్ప రాజ్ స్కూలు వెళ్లే సమయంలో పరిగెడుతూ ఉంటాడు. అంతకుముందు షాట్‌లో ఆ రోడ్డు మీద స్కూటర్ ఉండదు. అలాగే ఓ సైకిల్ ఉంటుంది. కానీ షాట్ యాంగిల్ మార్చేసరికి స్కూటర్ వస్తుంది, సైకిల్ వెళ్లిపోతుంది.
* తొలి డీల్ చేసి వచ్చిన డబ్బుతో కారు కొనుక్కుంటాడు పుష్ప గుర్తుందా. అప్పటివరకు కారు డోర్ కూడా తీయడం రాదు పుష్ప, కేశవకి. కానీ కారు కొన్నాక కేశవ ఏకంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తాడు.
* మంగళం శ్రీనుని పుష్ప కలవడానికి వచ్చే ముందు అక్కడ ఓ మర్డర్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత షాట్‌లో ఆ డెడ్ బాడీ అక్కడి నుండి మిస్ అయిపోతుంది.
* మంగళం శ్రీనుకి వార్నింగ్ ఇచ్చి పుష్ప వెళ్తున్నప్పుడు అక్కడ పప్పులు ఆరబెట్టిన టేబుల్ యాంగిల్… ఆ తర్వాత షాట్‌లో యాంగిల్ మారిపోయింది… నిలువుగా అయిపోతుంది.
* పుష్పరాజ్‌ని కొండారెడ్డి కొడుకులు జామీను ఇచ్చిన విడిపించాక… లారీ ఉన్నప్లేస్‌కి తీసుకెళ్తారు. వెళ్లేముందు పుష్ప బ్రౌన్ కలర్ చొక్కా వేసుకొని ఉంటాడు. వెళ్లాక చూస్తే పచ్చ కలర్ చొక్కా వేసుకుని ఉంటాడు.
* కొత్త కారు కొన్నా పుష్ప… తన తల్లిని ఎక్కించుకుని తన అన్నల ఇంటి ముందు చక్కర్లు కొడతాడు. అప్పుడు ఓ యాంగిల్‌లో ఇంటి ముందు మనుషులు ఉంటే, మరో యాంగిల్‌లో ఉండరు.
* జాలి రెడ్డికి పుష్ప ఎగిరి కొట్టానికి ముందు టేబుల్ మీద బాటిల్ ఉంటుంది. ఆ తర్వాత షాట్‌లో కనిపించదు. అలాగే టేబుల్ ప్లేస్‌మెంట్ కూడా తదనుగుణంగా మారిపోతూ ఉంటుంది. ఆఖరి టేబుల్ మాయమైపోతుంది కూడా.
* మంగళం శ్రీను బావమరిదిని పుష్ప గన్నుతో కాల్చి చంపినప్పుడు యాంగిల్ కాలువైపు ఉంటుంది. కానీ కాల్చాక చూస్తే బులెట్ తలలో దిగిపోయి ఉంటుంది.